ఆ సత్యానికి పాతర వేయాలనుకున్న కేటీఆర్‌!

తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అందరికీ తెలిసిన ఒక రహస్యానికి ఎన్నటికీ బహిరంగపరచే యోగ్యత లేకుండా పాతర వేసేయాలని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అనుకున్నారా? ఒక చారిత్రక సత్యం కేవలం ఉన్నత వర్గాలు, ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే సంపన్న, సెలబ్రిటీ వర్గాల వరకు మాత్రమే పరిమితం కావాలని.. అంతకుమించి సామాన్య ప్రజలకు తెలియకూడదని ఆయన భావించారా? ఆ సత్యం వెలికి వస్తే… బహిరంగం అయితే.. తమ పార్టీ పరువు పోతుందని, లేదా తమ పార్టీ మాట నిలకడ మీద తన తండ్రి నిజాయితీ మీద కొన్ని వర్గాల్లో కొత్త అనుమానాలు పుట్టే అవకాశం ఉన్నదని ఆయన భయపడ్డారా? తాజాగా కేటీఆర్‌ మాటలను గమనించినప్పుడు ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి.

గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం బాధ్యతలు మాత్రమే కాదు.. వనరులు, బలాలు, బలగాల సమీకరణ వంటి కీలక అంశాలను కూడా కేటీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన జూబ్లీహిల్స్‌లో సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, సెలబ్రిటీల్తో ఓ ప్రత్యేకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రత్యే రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల నిర్ణయం తీసుకుంటే.. తెరాస పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేయాలని ఒక దశలో తమ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారనే అందరికీ తెలిసిన రహస్యాన్ని తొలిసారిగా కేటీఆర్‌ ఓపెన్‌గా ప్రకటించారు. అయితే ఈ మాట చెప్పబోయే ముందు.. ఇక్కడ మీడియా వాళ్లున్నారా అని ఒకసారి చెక్‌ చేసుకుని మరీ కేటీఆర్‌ ఆ విషయాన్ని బయటపెట్టారు. అయితే మీడియా లేకుండా ఉన్న సమయం చూసి ఈ ముక్క వెల్లడించాలనే ఆలోచన కేటీఆర్‌కు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నోరు జారారు సరే.. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని సమాధి చేసేయాలనే తెరాస వారంతా అనుకుంటూ ఉన్నారా?అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి.

కేటీఆర్‌ చెప్పిన తీరు అలాగే కనిపిస్తోంది. రాష్ట్రం వచ్చిన తర్వాత. తెరాస విలీనం జరగకుండా పోయినప్పటినుంచి కాంగ్రెస్‌ నాయకులు మమ్మల్ని కేసీఆర్‌ మోసం చేశాడు.. విలీనం చేస్తానని వంచించాడు. అంటూ పదేపదే గొంతు చించుకుంటూనే ఉన్నారు. ఆయన చెప్పాడో లేదా, వీరు ఆశించారో అనే ఉద్దేశంతో జనం రకరకాలుగా దీన్ని గురించి అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా కేటీఆర్‌ విలీనం ఆలోచన నిజమే అని వెల్లడించడంతో.. ఆ రహస్యాన్ని పాతర వేసేయాలనే ఇన్నాళ్లూ వారు అనుకున్నారేమో అనిపిస్తోంది. కొన్ని చారిత్రక సత్యాలు ఎప్పుడూ మరుగున పడే ఉంటాయి. యథాలాపంగా, చాలా యాదృచ్ఛికంగా బయటపడుతూ ఉంటాయి. చరిత్ర చెప్పే సత్యం ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close