కేటీఆర్ సవాల్‌‌‌: ఆత్మవిశ్వాసమా – అతి విశ్వాసమా?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న చేసిన సంచలన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఆయనది ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా అనేది అందరికీ ప్రశ్నార్థకమయింది. కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడినపుడు 2014 సాధారణ ఎన్నికల్లో తమ పార్టీకి 24 శాతం ఓట్లు వచ్చాయని, అంటే 30, 35 సీట్లు గెలుచుకునే బలం అప్పుడే తమకుందని చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మెచ్చి 18 నెలల్లో ఎంతోమంది పార్టీలో చేరటంతో బలం గణనీయంగా పెరిగిందని అన్నారు. ప్రజలు తమకు ఓటేయకపోవటానికి ఒక్క కారణం కూడా కనబడటంలేదని చెప్పారు. అందుకే ధీమాతో చెబుతున్నానని, ఒంటరిగానే 100 సీట్లు గెలుచుకుంటామని అన్నారు.

కొద్ది రోజులక్రితం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారు. అభ్యర్థి దయాకర్ ఎంపికనుంచి విజయం వరకు మొత్తం తానై చక్రం తిప్పారు. హరీష్ రావు తన మనిషి ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్నా కేటీఆర్ తన మాటే నెగ్గించుకున్నారు. ఇక ఆ తర్వాత కేటీఆర్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని ఎన్నికల వ్యూహాన్ని, పోల్ మేనేజ్‌మెంట్‌ను సింగిల్ హ్యాండెడ్‌గా నడిపారు. ముఖ్యంగా మైక్రో లెవల్ ప్లానింగ్‌తో, నియోజకవర్గాన్ని చిన్న చిన్న ఏరియాలవారీగా విభజించి మంత్రులను, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులను మోహరించటంతో అద్భుతమై ఫలితాన్ని సాధించారు. పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికను వార్డ్ ఎన్నిక స్థాయిలాగా మార్చారని చెప్పాలి.

వరంగల్ ఉపఎన్నిక ఫలితం తారకరామారావులో కాన్ఫిడెన్స్ నింపటంతోబాటు పార్టీలో సమీకరణాలను మార్చేసింది. అప్పటివరకు కేటీఆర్‌పై హరీష్‌రావే కాస్త పైచేయిగా ఉన్నట్లు కనిపిస్తుండగా, వరంగల్ విజయంతో కేటీఆర్ ఆ ముద్రను చెరిపేశారు. పార్టీలో తనకంటూ ఒక ఇమేజ్‌ను, గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌కు సమర్థుడైన వారసుడినని నిరూపించుకున్నట్లయింది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే వరంగల్ మేజిక్‌ను హైదరాబాద్‌లో రిపీట్ చేస్తానని కేటీఆర్ భావిస్తున్నట్లు కనబడుతోంది.

వరంగల్‌లో అంత భారీగా 5 లక్షల మెజారిటీ రావటానికి రెండు ప్రధానమైన కారణాలను చెప్పుకోవాలి. ఒకటి – ఆ ఎన్నికకు కొద్ది రోజులక్రితమే హైదరాబాద్‌లో జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవం, రెండు – టీఆర్ఎస్‌కు ఓట్లు వేయనివారికి సంక్షేమ పథకాలను కట్ చేస్తామని లోపాయకారీగా గులాబీనేతలు చేసిన బెదిరింపులు. మరి హైదరాబాద్‌లో ఈ ఫార్ములా పనిచేస్తుందా అంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పథకం ప్రస్తుతానికి టీఆర్ఎస్‌కు బ్రహ్మాస్త్రమే. దానిలో అనుమానం లేదు. అయితే హైదరాబాద్ నగర ప్రజలు చైతన్యవంతంగా ఉంటారు కాబట్టి సంక్షేమపథకాలను కట్ చేస్తామనే బెదిరింపులు ఇక్కడ నడవవు. దానికితోడు నగరంలో 20-25 లక్షలమంది సెటిలర్స్(సీమాంధ్రవాసులు) ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ జిల్లా పరిధిలో టీఆర్ఎస్ ఒకే ఒక్క స్థానాన్ని(పద్మారావ్ గౌడ్) గెలుచుకుంది. మరి ఏ కాన్ఫిడెన్స్‌తో కేటీఆర్ ఇంత పెద్ద సవాల్ చేశారనేదే చర్చనీయాంశం.

నిన్న కేటీఆర్ చేసిన సవాల్‌లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ మీట్ ది ప్రెస్‌లో ఉన్న పాత్రికేయ దిగ్గజాలకు ఈ ప్రశ్న ఎందుకు తట్టలేదోగానీ, కేటీఆర్ రాజీనామా చేసేది 100 స్థానాలు గెలుచుకోకపోతేనా, గ్రేటర్ పీఠంపై గులాబీ జెండాను ఎలాగైనా ఎగరేయకపోతేనా అన్నది ఒక తిరకాసు. ఎందుకంటే మేయర్ పీఠానికి కావలసింది 75 స్థానాలు. మజ్లిస్‌ పార్టీతో ప్రీ పోల్ అలయెన్స్ లేదని చెప్పారుగానీ పోస్ట్ పోల్ అలయెన్స్ లేదని చెప్పలేదు. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వంటి ఎక్స్ అఫిషియో సభ్యుల బలం గణనీయంగా దాదాపుగా 50 దాకా ఉంది. అంటే టీఆర్ఎస్‌కు 30, 40 స్థానాలు వచ్చినా ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో మేయర్ పీఠాన్ని ఎగరేసుకుపోతారు. ఒకవేళ నాలుగైదు తగ్గినా ఆ స్థానాలను సంపాదించుకోవటం ఎలాగో టీఆర్ఎస్‌కు బాగా తెలుసు. ఆ విధంగా ఆలోచించే, ఆ నమ్మకంతోనే కేటీఆర్ సవాల్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఏది ఏమైనా దేశంలోని అనేక మంది రాజకీయ నేతలకు ఉన్న వారసుల్లాగా కాక కేటీఆర్ సమర్థుడైన వారసుడేనని చెప్పాలి. దానికితోడు భేషజాలకు పోకుండా అందరితో కలిసి మెలసి నడుచుకుంటున్నారు, ప్రజలను పలకరిస్తున్నారు, కష్టపడి తిరుగుతున్నారు… పనిచేస్తున్నారు. దేశ విదేశాల్లో తిరిగిన ఎక్స్‌పోజర్ ఉంది, వివిధ భాషల ప్రావీణ్యం కూడా ఉంది, తెలివి కూడా ఉంది. అందుకనే అన్నీ ఆలోచించే గ్రేటర్ పీఠంపై సవాల్ విసిరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close