టి. కాంగ్రెస్ నేత‌ల‌కు కుంతియా క్లాస్ పీకార‌ట‌!

తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు! ఒకే టీమ్ లో ర‌క‌ర‌కాల జ‌ట్లు అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా హైక‌మాండ్ పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఎత్తుల్లో భాగ‌మే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించ‌డం. ఢిల్లీకి రేవంత్ వెళ్ల‌డం, రాహుల్ గాంధీతో చ‌ర్చించ‌డం.. ఇలాంటి క‌థ‌నాల‌న్నీ ఈ మ‌ధ్య వ‌చ్చాయి. పార్టీ మార్పుపై రేవంత్ ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదుగానీ… ఆయ‌న కాంగ్రెస్ లోకి వ‌స్తే మంచిదే అని కొంత‌మంది సీనియ‌ర్లు ఓకే అనేశారు. యువ‌త‌కు కొత్త జోష్ వ‌స్తుంద‌ని చెప్పేశారు. రాహుల్ తో రేవంత్ భేటీ అయిన‌ప్పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అక్క‌డే ఉన్నారు. అంటే, ఆయ‌న నుంచి వ్య‌తిరేక‌త లేదు. ఇక‌, సీనియ‌ర్ నేత వీహెచ్ కూడా రేవంత్ రాక‌పై సానుకూలంగా ఉన్నారు. రేవంత్ ని పార్టీలోకి తేవాల‌ని తెర వెన‌క ప్ర‌య‌త్నాలు చేసిన ప్ర‌ముఖుల్లో జానారెడ్డి ఉన్నారు! కాబ‌ట్టి, సీనియ‌ర్ల నుంచి ఎలాంటి వ్య‌తిరేక‌తా వ్య‌క్తం కావ‌డం లేదు. అలాగ‌ని రేవంత్ రాక‌కు అంద‌రూ రెడ్ కార్పొట్లు వేసేస్తున్నారు అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, అది టి. కాంగ్రెస్ పార్టీ! రేవంత్ చేరిక‌ను కొంద‌రు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ట‌. మ‌రి, ఆ అసంతృప్తులు ఎందుకు బ‌య‌ట‌కి రాలేదంటే.. వారికి గ‌ట్టి క్లాస్ ప‌డింద‌ని తెలుస్తోంది.

రేవంత్ రాక‌పై ఓ ముగ్గురు నాయ‌కులు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. ఆయ‌న్ని పార్టీలోకి చేర్చుకుంటే త‌మ ప్రాధాన్య‌త త‌గ్గిపోతుంద‌నే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. న‌ల్గొండ‌, మహ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌కు చెందిన ఇద్ద‌రు మాజీ మంత్రులు రేవంత్ విష‌య‌మై తీవ్రంగానే అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదే విష‌య‌మై రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ కుంతియాకు కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై ఆయ‌న వెంట‌నే స్పందించారానీ, ఫిర్యాదు చేసిన స‌ద‌రు నేత‌ల‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న స‌మాచారం ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయంగా మారింది. రాష్ట్ర నేత‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని తెలంగాణ ఇచ్చామ‌నీ, అయినా మీరు ఏం సాధించార‌ని కుంతియా వారిని ప్ర‌శ్నించార‌ట‌. గ‌డ‌చిన మూడున్న‌రేళ్ల‌లో పార్టీ బ‌లోపేతానికి ఏం చేశారంటూ నిల‌దీశార‌ట‌. అధిష్టానం తీసుకునే నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించొద్ద‌నీ, ఎంతో మేథో మ‌థ‌నం త‌రువాతే కీల‌క నిర్ణ‌యాలు ఉంటాయ‌నీ మండిప‌డ్డ‌ట్టు స‌మాచారం. ఇక‌, రాహుల్ ద‌గ్గ‌ర‌కు ఈ విష‌యాన్ని తీసుకెళ్తామ‌ని స‌ద‌రు నేత‌లు అనుకున్నా.. పార్టీలో కొత్త ర‌క్తం కావాల‌ని ఆయ‌న ముందే చెప్పేస్తున్నారు! కాబ‌ట్టి, ఈ అభ్యంత‌రాల‌ను ఆయ‌న వినే అవ‌కాశం లేదు.

అందుకే, రేవంత్ విష‌యంలో ఎవ్వ‌రూ బ‌హిరంగంగా విమ‌ర్శలు చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ రేవంత్ చేరిక ఖాయ‌మైతే అప్పుడు వీరు నోరువిప్పే అవ‌కాశం ఉంది. అంటే, రేవంత్ రాక‌తో అద్భుతాలు జ‌రుగుతాయ‌ని కాంగ్రెస్ ఆశిస్తున్నా… ఆయ‌న రాక‌తో అసంతృప్తులు పెరిగే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ విష‌యం అధిష్టానానికి ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మై ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close