కర్నూలు టీడీపీకి చేరికల సైడ్ ఎఫెక్టులు..!

కర్నూలు జిల్లాలో ఉన్న రాజకీయ దిగ్గజ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టలో చేరిపోయాయి. కోట్ల, కేఈ, గౌరు, భూమా కుటుంబాలన్నీ.. టీడీపీలోనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్న సీట్లలో దాదాపుగా.. అంతా వీరు.. లేదా వీరి అనుచరులు పోటీ చేయడం ఖాయమైపోయింది. దాంతో.. ఇప్పటి వరకూ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న కొంత మంది… నిరాశ చెందుతున్నారు. తమకు అవకాశాలు కల్పించే పరిస్థితి లేకపోవడంతో..పక్క చూపులు చూస్తున్నారు. కోట్ల కుటుంబం చేరికతో కేఈ కుటుంబం అసంతృప్తికి గురి కాకుండా.. సర్దుబాటు చేసినా… గౌరు కుటుంబం టీడీపీలో చేరికతో మాత్రం సైడ్ ఎఫెక్టులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. పాణ్యం టిక్కెట్‌ను టీడీపీ తరపున.. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నారు. ఆయన గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ.. గౌరు చరిత టీడీపీలోకి రావడంతో.. ఆమెకు చంద్రబాబు చాన్సిచ్చారు. మరెక్కడా.. ఏరాసు ప్రతాప్ రెడ్డికి అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. శ్రీశైలంలోనూ… వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బుడ్డా రాజశేఖర్ రెడ్డికి.. టిక్కెట్ ఖరారు చేశారు. దాంతో.. ఏరాసు.. అసంతృప్తికి గురయ్యారు. ఆయన పార్టీ వీడతరాని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా.. అసంతృప్తితో ఉన్నారు. ఆయన వయోభారం కారణంగా.. బరిలోకి దిగడం అనుమానమే. అయితే తన అల్లుడికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన పట్టు బడుతున్నారు. అవకాశం మాత్రం రావడం అనుమానాస్పదంగా ఉంది. దాంతో ఆయన కూడా అనుచరులతో సమావేశం అవుతున్నారు. ఇక నంద్యాల ఎన్నికల సమయంలో.. పార్టీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డి.. నంద్యాల పార్లమెంట్ టిక్కెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు.

కానీ.. ఆ టిక్కెట్ ఇప్పుడు గౌరు చరిత సోదరుడు మాండ్ర శివానందరెడ్డికి ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎంత మందిని చంద్రబాబు బుజ్జగిస్తారన్నదానిపై క్లారిటీ లేదు కానీ… వారికి ఇతర పార్టీల్లో ఆప్షన్లు వస్తే మాత్రం.. వెళ్లి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. వెళ్లే వాళ్ల కన్నా… వచ్చే వాళ్లే ప్రజాబలం కలిగిన వారని.. టీడీపీ నేతలు నమ్మకంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close