కుటుంబరావు బయట పెట్టే ఆ సంచలన స్కాములు ఏమిటి..?

ఆంధ్రప్రేదశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గత నెలలో ఓ సారి కేంద్రం కదిలిపోయే కుంభకోణం బయట పెడతామని హెచ్చరించారు. మళ్లీ నిన్నోసారి.. ఓ సంచలన స్కాం…వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నారు. దాన్ని కూడా త్వరలోనే బయట పెట్టబోతున్నామని హెచ్చరించారు. రెండు సందర్భాల్లోనూ “హింట్లు” ఇచ్చారు. మొదటి స్కాంలో ప్రశాంత్‌ భూషణ్‌ వాదిస్తోన్న ఓ కేసుకు సంబంధించిన వ్యవహారమన్నారు. దీనితో ప్రధాని మోడీకి ప్రత్యక్ష ప్రమేయం ఉందన్నారు.

నిన్న మరోసారి మీడియాతో మాట్లాడుతూ.. గోవాలో బ్రిక్స్ సమావేశం జరుగుతున్నప్పుడే.. దేశానికి నష్టం జరిగే ఓ డీల్ జరిగిందన్న విషయాన్ని బయటపెట్టారు. 12 బిలియన్ డాలర్లు పెట్టుబడి పేరుతో ప్రభుత్వ సన్నిహిత కార్పొరేట్ పెద్దలకు మేలు చేసేలా పన్నురాయితీలు ఉండే దేశాల మధ్య ఒప్పందం జరిగినట్లు చూపించి..ఓ అతి పెద్ద పెట్టుబడి వ్యవహారంలో గూడుపుఠాణి చేశారని కుటుంబరావు ప్రకటించారు. తొలి స్కాంను రెండు నెలల్లో బయటపెడతానని చెప్పారు కానీ.. రెండో స్కాంకు టైం లిమిట్ పెట్టలేదు. కానీ ఈ రెండు మాత్రం కేంద్రం పీఠాల్ని కదిలిస్తాయని మాత్రం చెబుతున్నారు.

ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్న కుటుంబరావు మాటల్ని సాధారణ రాజకీయ నాయకుల బెదిరింపుల్లా తీసి పారేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే..కుటుంబరావు.. దేన్నైనా పూర్తిగా లెక్కలతో వివరిస్తారు. సాధికారికంగా చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేట్లు విడమరిచి చెబుతారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉందని కానీ… కాదేమో అని కానీ ఎవరికీ అనిపించదు. రెండు స్కాముల వివరాలు చెప్పేటప్పుడు కూడా.. తన ఆ చాతుర్యాన్ని చూపించారు.

బీజేపీ నేతలు పదే పదే తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక నుంచి ఇళ్ల వరకూ అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. సీబీఐ విచారణకు ఆదేశించుకోవాలని చంద్రబాబుకు సవాల్ చేస్తున్నారు. నిజానికి విచారణ సంస్థలన్నీ కేంద్ర అధీనంలో ఉంటాయి కదా..వారే విచారించుకోవచ్చు కదా.. అన్నదానిపై మాత్రం.. వారు ఆలోచించడం లేదు. కానీ కుటుంబరావు మాత్రం.. నేరుగా కోర్టుకే వెళ్తామంటున్నారు. అన్నీ అధారాలు ఉన్నాయని.. వాటికి ఎలాంటి లూప్‌హోల్స్ లేకుండా చూసుకుని.. కోర్టుకే వెళ్తామంటున్నారు. కేంద్రంపై చాలా ఆగ్రహంగా ఉన్న టీడీపీ… తమ వద్ద ఉన్న ఆధారాలతో… సంచనలం సృష్టిస్తుందేమో వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close