హోదా తరువాత కెవిపి పోలవరం టేకప్ చేయబోతున్నారా?

ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టి రాష్ట్రంలో మళ్ళీ ప్రత్యేక వేడి పుట్టించిన కెవిపి రామచంద్ర రావు, దాని తరువాత ఇప్పుడు అటువంటిదే మరో పెండింగ్ హామీ-పోలవరం ప్రాజెక్టుని టేకప్ చేసినట్లున్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఒక్కో అంశంపై పోరాటం చేస్తున్నప్పటికీ, దాని వలన కేంద్రప్రభుత్వంలో కదలిక ఏర్పడుతోంది కనుక ఆయన ప్రయత్నాలని స్వాగతించక తప్పదు. ఆయన నిన్న డిల్లీలో పోలవరం ప్రాజెక్టు గురించి మీడియాతో మాట్లాడినప్పుడు చాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

“పోలవరం ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేయరు. కేంద్రప్రభుత్వం కూడా దాని గురించి చొరవ తీసుకోదు. ఆ ప్రాజెక్టు గురించి నేను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి వ్రాసిన లేఖకి బదులే ఇవ్వలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే అవి రెండూ కలిసి పోలవరం ప్రాజెక్టుని అటకెక్కించేయాలని నిశ్చయించుకొన్నట్లు అనుమానం కలుగుతోంది,” అని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఉన్నందున దానిని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. కానీ దానికోసం ఇచ్చిన నిధులకి రాష్ట్ర ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదనే సాకుతో అవసరమైన నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్ర భాజపా నేతలు అదే విషయం పదేపదే మీడియా ముందు గట్టిగా ప్రస్తావిస్తున్నప్పటికీ, ఏపి మంత్రులు కానీ తెదేపా నేతలు గానీ వారి లెక్కల ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా కేంద్రప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని ఆరోపిస్తుంటారు.

సుమారు ఏడాదిగా వారి మధ్య ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ రెండు పార్టీలు తమ యుద్ధాలతో ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప దానిలో ఎదురవుతున్న సమస్యలని పరిష్కరించుకొని ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నించడం లేదు..కనీసం ఆలోచించడం లేదు. అందుకే రెండేళ్లుగా పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. బహుశః మిగిలిన మూడేళ్ళు కూడా ఆ రెండు పార్టీల నేతలు బహుశః ఇదేవిధంగా పోరాడుకొంటూ ప్రజలను మభ్యపెడుతూ రోజులు దొర్లించేసినా ఆశ్చర్యం లేదు.

ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్, వైకాపాలు ఇప్పటికే ప్రజలని ఆకట్టుకోగలిగాయి. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం వంటి అంశాలలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే ప్రజలని మభ్యపెట్టాలని చూస్తే, వచ్చే ఎన్నికలలో అవే కాంగ్రెస్, వైకాపాలకి ఆయుధాలుగా, గొప్ప వరాలుగా మారడం తధ్యం. రెండేళ్ళ క్రితం ఏ అంశాలు లేదా హామీలు తెదేపా-భాజపాలకి వారాలుగా మారాయో, వచ్చే ఎన్నికలలో సరిగ్గా అవే వాటికి శాపాలుగా ప్రతిపక్షాలకి వరాలుగా మరే అవకాశం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహిస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close