‘అజ్ఞాతవాసి’ అమెరికా డిస్ట్రిబ్యూటర్‌ చేతికి ఎన్టీఆర్‌ సినిమా

అమెరికాలో పవన్‌కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాని డిస్ట్రిబ్యూషన్‌ చేసిన ‘ఎల్‌ఏ తెలుగు’ సంస్థకు ఎన్టీఆర్‌ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను ఇచ్చారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక హాసిని సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత… వీరరాఘవ’. అమెరికాలో ఈ సినిమాను ‘ఎల్‌ఏ తెలుగు’ డిస్ట్రిబ్యూషన్‌ చేయనుంది. పంపిణీ రంగంలో ఈ సంస్థకు ‘అజ్ఞాతవాసి’ తొలి సినిమా. ఎప్పటికీ మర్చిపోవాలనుకొనే చేదు సినిమాగా కూడా మిగిలింది. సుమారు ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు కొంటే అందులో సగం వచ్చాయి. ఆ నష్టాలను భర్తీ చేయడానికి ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత…’ హక్కులను ఇచ్చారు. త్రివిక్రమ్‌ మాటల్లో చెప్పాలంటే… సర్దుబాటు చేసినట్టే. ‘అజ్ఞాతవాసి’ నష్టాలను భర్తీ చేయడానికి పవన్‌, నిర్మాత, తను కలిసి పాతిక కోట్ల వరకూ వెనక్కి ఇచ్చామని త్రివిక్రమ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. కొందరి డబ్బులు, అమెరికా డిస్ట్రిబ్యూటర్‌కి మరో సినిమా హక్కులు అన్నమాట! పవన్‌, ఎన్టీఆర్‌ సినిమాలకు ‘హారిక హాసిని’ చినబాబు (ఎస్‌ రాధాకృష్ణ) నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close