జ‌న‌తా గ్యారేజ్‌లో కామెడీ తక్కువా?

పాట‌లు విన్నాక‌, ట్రైల‌ర్ చూశాక జ‌న‌తా గ్యారేజ్‌పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. కొర‌టాల శివ ట్రాక్ రికార్డుకు ఇటీవ‌ల ఎన్టీఆర్ అందుకొన్న ఫామ్ తోడై… అభిమానులు మ‌రింత‌గా ఆశ‌లు పెంచేసుకొంటున్నారు. దాంతో పాటు.. విజువ‌ల్‌గా ఈ సినిమా ఎంత గ్రాండియ‌ర్‌గా ఉండ‌బోతోందో ట్రైల‌ర్‌లో క‌నిపిస్తూనే ఉంది. బాషా రేంజులో ఈ సినిమా ఆడేయ‌డం ఖాయం అని అప్పుడే ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు లెక్క‌లేసుకొంటున్నాయి. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. జ‌న‌తా గ్యారేజ్‌లో ఓ లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదే.. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సినిమా అంతా సీరియ‌స్ మోడ్‌లో సాగిపోతోంద‌ని, రిలీఫ్‌కి అవ‌కాశ‌మే లేద‌న్న‌ది లాబ్ రిపోర్ట్‌. హీరోయిజం ఎలివేట్ చేసే స‌న్నివేశాలు కొర‌టాల శివ బాగా రాసుకొన్నాడ‌ని, అయితే.. కామెడీకి ఈ సినిమాలో స్కోప్ లేకుండా పోయింద‌ని తెలుస్తోంది.

కంటెంట్ బేస్డ్ సినిమాల‌తో వ‌చ్చే స‌మ‌స్య ఇదే. మిగిలిన సినిమాల్లా ఆడుతూ పాడుతూ స‌న్నివేశాల్ని రూపొందించుకొనే ఛాన్స్ ఉండ‌దు. మిర్చి, శ్రీ‌మంతుడు సినిమాలు కూడా ఇంతేగా. ప‌గ‌ల‌బ‌డి న‌వ్వే సీన్ ఆ సినిమాలో ఒక్క‌టే ఉండ‌దు. కానీ.. సినిమాలు ఓ రేంజులో ఆడేశాయి. కొత్త రికార్డులు సృష్టించాయి. జ‌న‌తా గ్యారేజ్ కూడా అంతేన‌ని, ఎమోన్‌, హీరోయిజం, హృద‌యాన్ని తాకే డైలాగులు, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌.. వీటన్నింటితో ఈ సినిమా ప‌రుగు పెడుతుంద‌ని, కామెడీ లేక‌పోవ‌డం ఈసినిమాకి అస‌లు స‌మ‌స్యే కాద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ మైన‌స్‌ని ఎన్టీఆర్ ఎలా క‌వ‌ర్ చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com