ఎన్టీఆర్.. అన్నీ ఉన్నాయి – అదొక్క‌టి త‌ప్ప‌!

బాక్సాఫీసుని ప్ర‌భావితం చేయ‌గ‌లిగే అతి కొద్దిమందిలో ఎన్టీఆర్ ఒక‌డు. త‌న‌కి స‌రిప‌డా క‌థ ప‌డాలే గానీ… సూప‌ర్ హిట్ కొట్ట‌డ‌గ‌ల‌డు. యావ‌రేజ్ క‌థే అయినా త‌న స్టామినాతో… దాన్నిసూప‌ర్ హిట్ చేయ‌గ‌ల‌డు. స్టార్‌కి కావ‌ల్సిన అన్ని ల‌క్ష‌ణాలూ పుణికి పుచ్చుకొన్న ప‌రిపూర్ణ న‌టుడు. త‌న ద‌గ్గ‌ర అన్నీ ఉన్నాయి. ఒక్క ప్లానింగ్ త‌ప్ప‌. ఎన్టీఆర్ కెరీర్ ని ముందు నుంచీ… ఒక్కసారి పరిశీలించి చూస్తే ఎన్టీఆర్ ప్లానింగ్‌లో లోపాలు పుష్క‌లంగా క‌నిపిస్తాయి. ఫ‌లానా ద‌ర్శ‌కుడితో చేయాలి.. ఫ‌లానా క‌థ‌లు ట్రై చేయాలి.. అని ఎప్పుడూ అనుకోలేదు ఎన్టీఆర్‌. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన సినిమాలు చేసుకొంటూ వెళ్లాడు. సూప‌ర్ హిట్లు కొట్టాక కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చాడు. ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు కెరీర్ కాపాడుకోవ‌డానికి అప్పుడే హిట్ కొట్టిన వాళ్ల‌ని ఆశ్ర‌యించాడు. క‌థ‌ల ఎంపిక‌లో కూడా చాలా త‌ప్పులు చేశాడు. లుక్ ప‌రంగా కొన్నాళ్లు ఏమాత్రం శ్ర‌ద్ద చూపించ‌లేదు. ఇదంతా… ఎన్టీఆర్ లోపాలే.

ఇప్పుడు వ‌రుస హిట్ల‌తో మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చాడు. ఎన్టీఆర్ త‌ల‌చుకొంటే ఏం జ‌రుగుతుందో బాక్సాఫీసు ఫ‌లితాలే తేల్చి చెబుతున్నాయి. వ‌రుస‌గా భారీ వ‌సూళ్లు పిండేసే సినిమాల్నే చేస్తున్నాడు. కానీ ఇప్ప‌టికీ త‌న ద‌గ్గ‌ర ప్లానింగ్ లేదు. జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత ఏ సినిమా చేస్తావ్‌? అని అడిగితే ఎన్టీఆర్ సైతం తేల్చుకోలేక‌పోతున్నాడు. పోనీ.. త‌న ద‌గ్గ‌ర ఆప్ష‌న్లు ఏమైనా ఎక్కువ‌గా ఉన్నాయా అంటే అదీ లేదు. మిగిలిన హీరోలు అలా కాదు. చేతిలో నాలుగైదు క‌థ‌ల్ని పెట్టుకొన్నారు. ఆ స‌మ‌యంలో త‌మ‌కు అనువైన క‌థ‌ల్ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. కొత్త ద‌ర్శ‌కుల‌కు క‌ర్చీఫ్‌లు వేస్తున్నారు. ‘నీతో సినిమా చేస్తా… రెడీగా ఉండు’ అంటూ పక్కా ప్లానింగ్‌తో ప్రిపేర్ అవుతున్నారు. ఎన్టీఆర్‌లో ఇవేం క‌నిపించ‌డం లేదు. త‌న‌కు బాగా అచ్చొచ్చిన వినాయ‌క్, రాజ‌మౌళిల‌తో సినిమా చేసి చాలాకాలం అయ్యింది. నిజానికి ఎన్టీఆర్ కాస్త ముందుకు ప్రొసీడ్ అయితే.. ఈ కాంబినేష‌న్ల‌ను సెట్ చేసుకోవొచ్చు. కానీ.. త‌న‌వైపు నుంచి చొర‌వ చూపించ‌డం లేదు. హోం బ్యాన‌ర్ అంటూ ఎన్టీఆర్‌కి ఇప్పటి వ‌ర‌కూ లేక‌పోవ‌డం.. ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఎన్టీఆర్ ఇప్ప‌టికైనా త‌న లోపాల్ని గుర్తించాలి. త‌న భ‌విష్య‌త్తుకు తానే ఓ మార్గం వేసుకోవాలి. ఎన్టీఆర్ అభిమానులే కాదు, చిత్ర‌పరిశ్ర‌మ కూడా అదే కోరుకొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close