లగడపాటి ‘ల్యాంకో’ దివాళా?

హైదరాబాద్: లగడపాటి రాజగోపాల్ నెలకొల్పిన ల్యాంకో సంస్థలు దివాళాకు సిద్ధంగా ఉన్నాయి. ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ ఈ ఏడాది మార్చ్ నాటికి రు.35 వేలకోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. వడ్డీలకారణంగా ఈ మొత్తం రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు కంపెనీ పరిస్థితి ఇలా ఉండటంతో షేర్ మార్కెట్‌లో ఆ సంస్థ షేర్ విలువ దారుణంగా పతనమయింది. ఒక సమయంలో రు.80 ఉన్న ల్యాంకో షేర్ ఇప్పుడు రు.3 కు పడిపోయింది. దీనితో అనేక చోట్ల ఉన్న తమ విద్యుత్ ప్లాంట్‌లను అమ్మకానికి పెట్టారు.

లగడపాటి రాజగోపాల్ 1990వ దశకంలో ల్యాంకో సంస్థను స్థాపించి విజయవాడ సమీపంలోని కొండపల్లిలో విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. తర్వాత ఆయన సోదరులు మధుసూదనరావు, శ్రీధర్ కూడా ఆయనకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచారు. ఆ తర్వాత సంస్థ కోల్ మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలలోకి విస్తరించి భారీ విజయాలను చేజిక్కించుకుంది. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో ‘ల్యాంకో హిల్స్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ నిర్మించింది. అయితే 2008 నుంచి కంపెనీకి కష్టకాలం మొదలయింది.దీనికి కారణం విద్యుత్ రంగంలో ఏర్పడిన సంక్షోభమని కంపెనీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అప్పులు కొండలా పెరిగిపోవటంతో కొన్ని విద్యుత్ ప్లాంట్‌లను ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి, గ్రీన్‌కో ఎనర్జీస్ సంస్థకూ అమ్మేశారు. ఉద్యోగుల సంఖ్యను 7,000 నుంచి 4,000కు తగ్గించారు. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్(సీడీఆర్) ప్యాకేజ్ కోసం బ్యాంక్‌లను ఆశ్రయించారు. బ్యాంక్‌లను నయానో, భయానో ఒప్పించి ప్యాకేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఇటీవల ఢిల్లీలో చంద్రబాబును కలవటానికి కారణంకూడా ఇదేనంటున్నారు. అప్పులఊబిలో ఉన్న ల్యాంకో ఇన్‌ఫ్రాను గాడిన పెట్టటానికి లగడపాటి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా సంస్థలు దివాళా తీసినా యజమానులు మాత్రం దర్జాగానే జీవిస్తుంటారు. ఎటొచ్చీ నష్టపోయేది బ్యాంక్‌లూ, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌లూ. ఆ మధ్య ఒక వెలుగు వెలిగిన జీఎమ్ఆర్(గ్రంథి మల్లికార్జునరావు) గ్రూప్ పరిస్థితికూడా ఇప్పుడు దాదాపు ల్యాంకో తరహాలోనే ఉందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

బాల‌య్య ఇష్యూ: కేసీఆర్‌పై నెట్టేశారుగా!

`ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు న‌న్ను పిల‌వ‌లేదు` అన్న బాల‌య్య మాట - ప‌రిశ్ర‌మ‌లో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పే అని ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు తేల్చేస్తున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా...

HOT NEWS

[X] Close
[X] Close