అధికారం ఉంటేనే వాళ్లకు చంద్రబాబు దగ్గర..!

రాజకీయాల్లో అధికారం ఉంటే ఎవరికైనా క్రైజ్. అధికారం ఉన్నంత కాలం… వంగి వంగి దండాలు పెట్టేవారు… అలాంటి అవకాశం లేకపోయినా సోషల్ మీడియాలో ప్రతీదానికి ఓ పొగడ్త కురిపిస్తే… పడి ఉంటుందని అనుకునేవారు కోకొల్లలు. ఇలాంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా పని చేసిన వాళ్లకూ తప్పదు. చంద్రబాబుకూ తప్పలేదు. రాజకీయ అవసరాల కోసం.. అధికారం అండతో పనులు చక్క బెట్టుకునేవారు.. ఇలా కొంత మంది చేస్తూంటారు కానీ.. కుటుంబసభ్యులకు మాత్రం.. అధికారంతో నిమిత్తం లేకుండా అభిమానం ఉండాలి. కుటుంబ పరంగా ఎంతో సాయం చేశారని చెప్పుకున్న వారు కూడా.. కొంత మంది చంద్రబాబును 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సోషల్ మీడియాలో కూడా విషెష్ చెప్పడానికి మనసు రాలేదు.

సాధారణంగా పదవి కోల్పోయిన నాయకుడికి ఆదరణ ఉండదు. కానీ చంద్రబాబు 70వ పుట్టిన రోజుకు.. సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఐదు లక్షల మందికిపైగా ట్వీట్లు చేయడంతో.. టాప్ ట్రెండింగ్‌లో ఉంది. చంద్రబాబు కూడా.. వీలైనంత మందికి ధ్యాంక్స్ చెప్పారు. కుదరని వారందరికీ.. క్షమాపణలు చెబుతూ.. ధ్యాంక్స్ నోట్ ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నుంచి కేంద్రం నేతలు కూడా.. శుభాకాంక్షలు చెప్పారు. ఇవన్నీ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఈగోలు అడ్డు రావని వీరు నిరూపించారని.. నెటిజన్లు కొనియాడారు.

అయితే.. సహజంగానే టీడీపీ ఫ్యాన్స్… ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా విషెష్ వస్తాయని ఆశించారు. కానీ.. ఆ వైపు నుంచి రెస్పాన్స్ లేదు. సోషల్ మీడియా మొత్తం చంద్రబాబు పుట్టినరోజు ట్వీట్లతో హోరెత్తిస్తున్నా ఆయన మాత్రం విషెష్ చెప్పడానికి కూడా సంశయించారనే అసంతృప్తి టీడీపీ క్యాడర్‌లో కనిపిస్తోంది. కుటుంబ పరంగా… అందరిలోనూ కలిసేలా చొరవ తీసుకున్న ది మామయ్యే చంద్రబాబేనని.. ఎన్టీఆర్ గతంలో పలుమార్లు చెప్పి ఉన్నారు కూడా. కారణాలు ఏవైనా.. చంద్రబాబుతో విబేధాలు ఉన్నాయన్న ప్రచారం బయట జరుగుతోంది. అయితే.. అది పుట్టిన రోజు విషెష్ కూడా చెప్పలేనంత వ్యక్తిగతంగా పెరిగాయా అన్నేదే చాలా మందికి డౌట్. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి ఎలాంటి సందర్భం వచ్చినా ఎగబడి విషెష్ చెప్పిన పెద్దలు.. ఇప్పుడు చంద్రబాబుకు ఓ ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు చెబితే.. ఎక్కడ ఏ నష్టం వస్తుందోనని.. ఉరకుండిపోయారు. చంద్రబాబును ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కలవలేని వారు.. ఆయన పనితీరుకే అభిమానులుగా మారిన వారు…మాత్రం… సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close