వైఎస్ విజయమ్మకు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు. ఆయన చెప్పలేదు. కనీసం సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టడానికి కూడా ఆయనకు మనసు రాలేదు.కానీ నారా లోకేష్ చెప్పాడని ఆయనను తిట్టించడం ప్రారంభించారు. ఇందు కోసం లక్ష్మిపార్వతిని రంగంలోకి దింపారు. వైసీపీ అనుకూల మీడియా అంతటిని.. స్వయంగా లక్ష్మి పార్వతి దగ్గరకు తీసుకుపోయి ఇంటర్యూలు, లైవ్‌లు ఇప్పించారు.
అందులో ఆమె ఎం చెప్పిందంటే… నారా లోకేష్.. విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పడం తప్పు.. రాజకీయం కోసమే అలా చెప్పారు అని చెప్పుకొచ్చారు. రాజకీయం కోసమో.. వ్యక్తిగతం అభిమానంతోనో .. కుమారుడు నిరాదరిస్తున్న తల్లి బాధను అర్థం చేసుకునో ఆయన సాంత్వన కల్పించడానికి చెప్పి ఉంటారు.. అందులో తప్పేముందో మాత్రం లక్ష్మిపార్వతి చెప్పలేదు. తాను నాయనమ్మనని.. తనకు ఎందుకు చెప్పలేదని కూడా ప్రశ్నించారు. ఆమె డిమాండ్ చూసి.. సోషల్ మీడియాలో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమెను నారా, నందమూరి కుటుంబసభ్యులెవరూ కుటుంబసభ్యురాలిగా ఎప్పుడూ చూడలేదు. ఆమె మాత్రం వరుసలు కలిపేసుకుంటూ ఉంటారు.
వైసీపీ పంచన చేసి.. నారా, నందమూరి కుటుంబాలను తిట్టడానికి ఓ పావుగా ఉంటున్న ఆమె .. జగన్ కు అవసరం అయినప్పుడల్లా ఇలా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తూంటారు. జగన్ రెడ్డి తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుని.. దానికి కూడా చంద్రబాబుపై ఏడుస్తూంటారు. అలాంటి ఏడుపులకు లక్ష్మిపార్వతి లాంటి వారు ఓ టూల్ ఉపయోగపడుతూంటారు. జగన్ చంద్రబాబు కుటుంబంపై దాడికి గతంలో చాలా మందిని ఉపయోగించారు.. ఇప్పుడెవరూ లేరు.. లక్ష్మిపార్వతి మాత్రమే మిగిలారు. అందుకే ఆమెను ప్రయోగిస్తున్నారు.
