ఏపీలో “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదల కాదు..! నిర్మాతల ప్లాన్ సక్సెస్..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో ఎన్నికలకు ముందు విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనికి సంబందించి హైకోర్టులో నిర్మాతలు దాఖలు చేసిన కేసుపై.. విచారమను… ఈనెల 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఇదే కేసు పెండింగ్‌లో ఉన్నందున… తీర్పు చెప్పలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సినిమా ప్రివ్యూ కూడా చూడలేమని తెలిపింది. విడుదలకు ఒక్క రోజు ముందు.. తమ సినిమాకు ఆటంకాలు లేకుండా విడుదలయ్యేలా చూడాలంటూ నిర్మాతలు కోర్టుకు వెళ్లారు. అంతకు ముందు మంగళగిరి కోర్టు.. సినిమాను విడుదల నిలిపివేయాలని ఆదేశించింది. హైకోర్టు నిర్మాతల పిటిషన్ చూసి… సినిమా చూసిన తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది. మూడో తేదీకి వాయిదా వేసింది. అయితే.. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పిన నేతలు..మూడు రోజుల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

అత్యవసరంగా విచారించాలని కోరారు. సుప్రీంకోర్టు.. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చి.. పిటిషన్ ను వాయిదా వేసింది. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ లోపే.. హైకోర్టులో పిటిషన్ వాయిదా గడువు వచ్చింది. విచారణ జరిపిన హైకోర్టు.. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తామెలాంటి తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దాంతో నిర్మాతలు మళ్లీ .. సుప్రీంకోర్టు విచారణ వరకూ వెయిట్ చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతనే ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానుంది. పదకొండో తేదీన పోలింగ్ కు ముందే సినిమాను విడుదల చేయాలన్నది.. నిర్మాతల లక్ష్యం. అది నెరవేరే అవకాశం కనిపించడం లేదు.

విడుదల చేసుకోవడం ఇష్టం లేకనే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలు సుప్రీంకోర్టుకు వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో విడుదలైన సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ధియేటర్లకు రెంట్ ఎదురు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏపీలో విడుదల చేసినా.. చూసేవాళ్లు ఎవరూ ఉండరని చెబుతున్నారు. అన్ని పార్టీల కార్యకర్తలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. సామాన్య సినీ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలపై ఆసక్తి చూపరు. అందుకే విడుదల చేయకూడదన్న కారణంగానే సుప్రీంకోర్టుకు వెళ్లి సక్సెస్ అయ్యారన్న విమర్శలు వైసీపీ నేతలు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close