అవును..ఇది ‘లక్ష్మీపార్వతి ఎన్టీఆర్’

తెలుగు360 రేటింగ్‌ 2/5

చరిత్ర అనేది చాలా వరకు అది రాసిన వారి దృక్కోణంపై ఆధారపడి వుంటుంది. నికార్సయిన చరిత్రకారులు ఇప్పుడు ఎవ్వరూ లేరు. అలా అని జరిగిన సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచినవారు గొంతు విప్పేది లేదు. పోనీ, అప్పట్లో వచ్చిన మీడియా క్లిప్పింగ్ లు ఆధారం అంటే వాటిని నమ్మడానికి లేదు. ఇది చాలా మంచి అవకాశం రామ్ గోపాల్ వర్మలాంటి వాళ్లకు. ఏం తీసినా సమర్థించుకోవచ్చు. ఎలా తీసినా ఇదే రైటు అని వాదించుకోవచ్చు. అందుకే ఆయన తన సినిమా టైటిల్ కు న్యాయం చేసేలా సినిమా తీసి విడుదల చేసినట్లు కనిపిస్తోంది.

అవును..ఇది లక్ష్మీపార్వతి ఎన్టీఆర్. ఇంకా క్లియర్ గా, క్లారిటీగా చెప్పాలంటే, ఆమె జీవితంలో కొంతభాగాన్ని ఎన్టీఆర్ బయోపిక్ గా మార్చి తీసిన వైనం. ఈ సినిమా కథ ప్రకారం..

లక్ష్మీపార్వతి అమాయకురాలు. ఎన్టీఆర్ అంటే ఆమెకు దైవంతో సమానం. కేవలం ఎన్టీఆర్ చరిత్ర రాయడానికి ఆమె ఆయన దగ్గరకు వచ్చింది. ఎన్టీఆర్ ఆమెపట్ల ఆకర్షితుడై పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏనాడూ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. చంద్రబాబే తన అభద్రతాభావంతో ఎన్టీఆర్ పిల్లలను, ఎమ్మెల్యేలను ఇంకా చాలా మందికి మాయమాటలు చెప్పి, మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా నడిపారు. కాంగ్రెస్ పార్టీ సాయంతో అధికారం చేజిక్కించుకుని, ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారు.

పాతికేళ్ల క్రితం ఏం జరిగిందన్నది ఇప్పటికీ చాలా మందికి తెలిసిన విషయం. అప్పట్లో పార్టీలో లక్ష్మీ పార్వతి కారణంగా అసమ్మతి రాజుకుందన్నది జగమెరిగిన సత్యం. ఆమె చీరలు, నగలు, వడ్డాణాలు, వెండి కిరీటాలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందుకున్నారన్నది అప్పట్లో వినిపించిన వాస్తవం. లక్ష్మీపార్వతి దూరమై, ఆమె భర్త వీరగంధం సుబ్బారావు మీడియాకు ఎక్కి, ఆమెపై, ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారన్నది జరిగిన సంగతి. పార్టీ చీలిన తరువాత, అధికారం పోయిన వెంటనే లక్ష్మీపార్వతి రాజకీయంగా బహిరంగంగానే వ్యవహరించిన సంగతి అంతకన్నా వాస్తవం. ఇవన్నీ పక్కన పెడితే, ఎన్టీఆర్ తోలిసారి అధికారం కోల్పోయిన తరువాత అయిదేళ్ల పాటు పార్టీని నిలబెట్టింది, మళ్లీ దేశం అధికారంలోకి రావడానికి చంద్రబాబు చేసిన కృషి తక్కువ కాదు.

కానీ, ఇవన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మచ్చుకైనా కనిపించవు. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు లక్ష్మీపార్వతి ఇమేజ్ పెంచడానికి, ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడానికి, ఆమెపై సానుభూతి పెంచడానికి చేసే ప్రయత్నం తప్ప వేరు వ్యవహారం కనిపించదు.

వాస్తవానికి ఓ సినిమా సమీక్ష ఇలా ఈ కోణంలొ చూడకూడదు. తీసిన సినిమా బాగుందా లేదా? అనే చూడాలి, చెప్పాలి, అనే వాదన వుండొచ్చు. కానీ ఇదే రామాయణమో, భారతమో, మరోటో ఇలా వక్రీకరించి తీస్తే, సమీక్ష ఎలా చేయాలి? ఆ వక్రీకరణ మీద దృష్టి పెట్టాలా? వద్దా? ఇప్పుడు చేయాల్సి అదే. కేవలం ఒక వ్యక్తి వ్యక్తిత్వ హననం కోసం, మరో వ్యక్తిని శిఖరాగ్రాన కూర్చో పెట్టడం కోసం, వర్తమాన చరిత్రను వక్రీకరిస్తే చెప్పక తప్పదు.

చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని తన వశం చేసుకున్నది వాస్తవం. ఎన్టీఆర్ తో ఆయన పిల్లలు కూడా విబేధించింది వాస్తవం. అయితే ఇదంతా కేవలం చంద్రబాబు తప్పిదమేనా? దానికి దారితీసిన పరిస్థితులను వాస్తవంగా వివరించాల్సిన అవసరం వుందా?లేదా?

ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ను సినిమాగా చూద్దాం.

సినిమా తొలిసగం అంతా లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్ కు ఏ విధంగా దగ్గరయింది. వాళ్లద్దరి పెళ్లి ఏ విధంగా జరిగింది. అది ఇంట్లో వాళ్లకు ఏ విధంగా అభ్యంతరమైంది అన్నదాని మీదే ఫోకస్ తో వుంటుంది. ద్వితీయార్థం మొత్తం లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి, బాబు ఎలా అధికారం లాక్కున్నారు, ఆ తరువాత ఎన్టీఆర్ మరణం అన్నది మలిసగం.

తొలిసగం అంతా కాస్త ఓపిగ్గా చూడాల్సి వుంటుంది. ఎంత ఎన్టీఆర్ జీవితంలో ఘట్టం అని సరిపెట్టుకుందామన్నా, వయసు మళ్లిన వ్యక్తికి, వయసులో వున్నఅమ్మాయికి మధ్య ప్రేమ, ఇంటిమసీ వంటి వ్యవహారాలు కాస్త ఇబ్బందిగానే వుంటాయి. మలి సగం మాత్రం ముందు రేసీగానే సాగుతుంది కానీ చివరకు వచ్చేసరికి మెలోడ్రామా దట్టించడం అన్నది కాస్త ఇబ్బందిగా వుంటుంది.

సినిమాకు అసలు సిసలు సమస్య కాస్టింగ్. నందమూరి కుటుంబ సభ్యులు, మోహన్ బాబు లాంటి పాత్రలకు అయితే మరీ రికార్డింగ్ డ్యాన్స్ జనాల వ్యవహారంలా వుంది. కానీ వర్మ తెలివిగా గొంతులు అన్నీ మిమిక్రీ చేయించి, జనాలను మాయచేసే ప్రయత్నం చేసాడు.

లక్ష్మీపార్వతిగా నటించిన యజ్ఞశెట్టి కారణంగా తొలిసగం కొంతవరకు చూడాలనిపించేలా వుంటుంది. అలాగే బాబుగా నటించిన శ్రీతేజ్ కూడా మంచి నటన కనబర్చాడు. కానీ ఎన్టీఆర్ పాత్రధారిని మాత్రం చాలా యాంగిళ్లలో చూడలేని పరిస్థితి వుంది.

సాంకేతికంగా సినిమాలో పాటలు కొంత వరకు బాగానే వున్నాయి కానీ జనాలకు పాడుకునేందుకు, తరచు వినడానికి పనికొచ్చేవి మాత్రం లేవు. నేపథ్యసంగీతం బాగుంది. వర్మ ఫ్రేమింగ్, డిటైల్డ్ ఎక్స్ ప్రెషన్లు అన్నీ మామూలే. అవి గతంలోని ఆయన సినిమాల్లోనూ వున్నాయి. ఇప్పుడూ వున్నాయి. ఎటొచ్చీ ఆయన చాలా తెలివితేటలు ప్రదర్శించారు మేకింగ్ లో. ఎన్టీఆర్ ఫ్యామిలీ లక్ష్మీపార్వతిని దూషించారు,కొట్టారు అన్నది, అంతా చూపించేసి, తూచ్ కల అన్నారు. అలాగే ఈనాడు ను పరోక్షంగా టార్గెట్ చేస్తూనే, అదే సమయంలో మిగిలిన పత్రికలను చూపించారు. అసలు ఎన్టీరామారావు, లక్ష్మీపార్వతి అనే నిజమైన పేర్లు వాడిన తరువాత మనదేశం, బాబు, రావు అంటూ మళ్లీ ఇలా డొంకతిరుగుడు పేర్లు దేనికో? ఇదంతా చూస్తుంటే సినిమాను తను అనుకున్నవిధంగా తీయాలి. అడ్డంకులు రాకూడదు. జనాల్లోకి తాను చూపించాలనుకున్నది వెళ్లాలి అనే ఆలోచన కనిపిస్తుంది. అంటే సినిమా మేకింగ్ లో కన్నా, రూపకల్పన మీద వర్మ ఎక్కవ దృష్టి, తెలివితేటలు వాడారని అనుకోవాలి.

టోటల్ గా చూసుకుంటే చంద్రబాబును తెలివిగా టార్గెట్ చేసే ఆలోచనతో, వీలయినంత తక్కువ బడ్జెట్ తో, ఎక్కువ లాభాలు ఆర్జించి, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రత్యర్థులకు పనికి వచ్చేలా తయారు చేసిన సినిమా ఇది.

ఫైనల్ టచ్…పొలిటికల్ బయోపిక్

తెలుగు360 రేటింగ్‌ 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close