ప్రధాని, ఆర్ధిక మంత్రి మాటలపై ఎల్ అండ్ టి పెదవి విరుపు

భారత్‌ వృద్దిరేటు 8-9శాతానికి తగ్గదని ప్రధాని నరేంద్రమోడీ, ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద చెబుతూంటారు. దేశంలోని అతి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎల్ అండ్ టి (లార్సన్‌ అండ్‌ టర్బో) గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఎ.ఎం.నాయక్‌ మాత్రం వీరిమాటలతో విభేదిస్తున్నారు. ఆసియాలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ మూడవ స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో వృద్ధి రేటు మందగిస్తోంది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందన్నది అనుమానమేనని 2100 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ప్రధానంగా మౌలిక వసతుల రంగంలో 70 అనుబంధ కంపెనీలున్న ఎల్ అండ్ టి సారధి, వ్యాపార దిగ్గజం, 77 ఏళ్ళ అనుభవజ్ఞుడు అయిన నాయక్ అభిప్రాయపడుతున్నారు.

దేశంలోని కొన్ని ఫ్యాక్టరీల్లో సామర్థ్యం కంటే తక్కు వ స్థాయిలో ఉత్పత్తి జరుగుతోందని. కొత్త ఆర్డర్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నాయని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్రమోడీ సంస్కరణలు అమల్లోకి తేవడంతో విఫలం అయ్యారని, వ్యాపారరంగాన్ని బలోపేతం చేయలేకపోయారని.. ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగం, మౌలిక రంగం వ్యాపారాలు పుంజుకోలేక కుదేలయ్యాయని చెప్పారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపధ్యంలో నాయక్ ను అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ‘రాయిటర్స్‌’ ప్రతినిధి ముంబాయిలోని నాయక్ కార్యలయంలో ఇంటర్వ్యూ చేశారు. గత త్రైమాసికంలో చైనాతో సమానంగా భారత్‌ కూడా జీడీపీ వృద్దిరేటును 7 శాతం సాధించింది. ఇదే జోరు రాబోయే రోజుల్లో కొనసాగలేదని ఆర్థికవేత్తలే చెబుతున్నారు. దీనికి కారణం దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం లేదని ఆయన వివరించారు. ప్రైవేట్‌ రంగంలో మూలధనం వ్యయం ఏడాది వెనకబడి పోయిందని ఇప్పటికే అతి పెద్ద కార్పొరేట్లు భారీ అప్పుల్లో కూరుకుపోయాయని.దీంతో వీరు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. న్యూఢిల్లీ ప్రభుత్వం మాత్రం బిలియన్‌ల కొద్ది డాలర్లు సొంత డబ్బును రోడ్లు, రైల్వే స్కీంలలో పెట్టుబడులు పెడుతోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ప్రచారానికి తాము స్పందించామని.. రక్షణ రంగానికి చెందిన పరికరాలను తయారు చేయ డానికి ఎల్‌అండ్‌టి ఫ్యాక్టరీలు సిద్దంగా ఉన్నాయని, అయితే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కరు ఆర్డరు వచ్చిన దాఖలాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం రోజుకు 30 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తామని చెబుతోంది. ఇప్పటికే డజను కంటే తక్కువ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు టెండర్లనే పిలవలేదని చెప్పుకొచ్చారు. పరిస్థితి ఊహించినంత పచ్చ గా లేదని నాయక్ వ్యాఖ్యానించారు. దేశంలోని అతి పెద్ద గ్రూపు కంపెనీల్లో ఎల్‌ అండ్‌ టి ఒకటి. దీని మార్కెట్‌ క్యాపిటలైజెషన్‌ 2100 కోట్ల డాలర్లు, గత కొన్ని త్రైమాసికాల నుంచి ఇన్వెస్టర్లను నిరుత్సాహ పరుస్తోం ది. రెవెన్యూ బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా మధ్య ప్రాచ్య దేశాల్లోని చమురు, గ్యాస్‌ క్లయింట్లు మందగమనంలో కొట్టు మిట్టాడటం… దీంతో భారత్‌ మార్కెట్లు కూడా బలహీన పడ డంతో దాని ప్రభావం కంపెనీపై పడింది. కంపెనీని గాడిలో పెట్టడానికి కొన్ని ఆస్తులను విక్రయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ముఖ్యంగా రోడ్లు, మౌలిక రంగానికి ప్రాజెక్టులను విక్ర యించే ఆలోచనలో ఉన్నట్లు నాయక్‌ చెప్పారు. చిన్న వ్యాపా రాలను విక్రయించి పెద్ద కంపెనీలపైదృష్టి పెడతామ న్నారు. ఎల్‌ అండ్‌ టి పలు కంపెనీలు నిర్వహిస్తోంది. వాటిలో మెట్రో ట్రెయిన్స్‌, జలాంతర్గాములు, అణు రియాక్టర్ల విడి భాగాలు తయారు చేస్తోంది. కంపెనీ చేతిలో సుమారు 70 వ్యాపారా లున్నాయి. కంపెనీని గాడిలో పెట్టడానికి ప్రతి కంపెనీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గాడిలో పెట్టడానికి ప్రోత్సహిస్తామని నాయక్‌ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close