నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి గ్యాప్ తీసుకున్నా: మహేష్ బాబు

బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ షో నుంచి కొత్త ప్రోమో వచ్చింది. ఈ షోకి ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేసి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ప్రోమోలో మహేష్ ని చూసిన బాలయ్య‘‘ఇంత యంగ్‌గా ఉన్నావేంటయ్యా బాబూ!’’ అని అడగ్గా మహేశ్‌ సిగ్గుపడటం నవ్వులు పూయించింది. తన సినిమాల్లోని ఏదైనా డైలాగ్‌ను వినిపించాలని బాలకృష్ణ మహేశ్‌ను కోరగా ‘‘మీ డైలాగ్‌ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు సర్‌’’ అని సమాధానం ఇవ్వడం కూడా నవ్వులు పంచింది. ఒకానొక సందర్భంలో మూడేళ్లు గ్యాప్‌ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందోనని బాలయ్య ప్రశ్నించగా .. ”నన్ను నేను కరెక్ట్ చేసుకోవడం కోసం ఆ గ్యాప్ తీసుకున్నా.. అని చెప్పడం… తర్వాత బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ అని చెప్పడం ప్రోమోకి ఫైనల్ టచ్ ఇచ్చింది.

2007లో వచ్చిన ‘అతిధి’ సినిమా తర్వాత ‘ఖలేజా’ చేయడానికి మధ్య దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఖలేజా తర్వాత మహేష్ గ్రాఫ్ ఒక్కసారిగా మారింది. సినిమా విజయాన్ని పక్కన పెడితే మహేష్ లో కొత్త మెరుపు కనిపించింది. డైలాగ్ మాడ్యులేషన్ లో సరికొత్త మార్పు వచ్చింది. తర్వాత వచ్చిన ‘దూకుడు’ విజయం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు మహేష్. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాకి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ లో సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close