చీర‌… బోర్ కొట్టేసింద‌ట‌!

లావ‌ణ్య త్రిపాఠీ. కామ్‌గా దూసుకెళ్లిపోతున్న క‌థానాయిక‌. పెద్ద హ‌డావుడి ఏమీ ఉండ‌దు. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్ల‌లో అంద‌రిలా హ‌ల్ చ‌ల్ చేయ‌దు. గాసిప్పులకు దూరంగా ఉంటుంది. అందుకే చాప కింద నీరులా.. రోజు రోజుకీ ఇండ్ర‌స్ట్రీలో స్ట్రాంగ్‌గా పాతుకుపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ తాను పోషించిన‌వ‌న్నీ ప‌ద్ధ‌తైన పాత్ర‌లే. గ్లామ‌ర్‌గా క‌నిపించింది గానీ, ఎక్క‌డా హ‌ద్దు మీర‌లేదు. ఈమ‌ధ్య కాలంలో చీర‌లో, ప‌రికిణీ ఓణీల్లో ఎక్కువ‌గా తార‌స ప‌డుతున్న నాయిక కూడా లావ‌ణ్య‌నే. సోగ్గాడే చిన్ని నాయన‌లో చీర‌లోనే ద‌ర్శ‌న‌మిచ్చింది. మిస్ట‌ర్‌లో కూడా అలాంటి పాత్రే ద‌క్కింద‌ట‌. అయితే.. మాటి మాటికీ చీర క‌ట్టుకోవ‌డంతో బోర్ కొట్టిన‌ట్టుంది. ‘మోడ్ర‌న్ పాత్ర‌లూ చేయాల‌నివుంది’ అంటూ మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టింది.

లావ‌ణ్య త్రిపాఠీ మాట్లాడుతూ ”చీరలో భార‌తీయ స్ర్తీలు చాలా అందంగా క‌నిపిస్తారు. నాకూ చీర‌లంటే చాలా ఇష్టం. అయితే.. ప్ర‌తీసారీ ఇలాంటి పాత్ర‌లే చేయ‌లేను క‌దా. నాకెరీర్‌లో నేను చేసిన సినిమాలన్నీ ఓసారి రివైండ్ చేసి చూసుకొంటే, అందులో అన్నిర‌కాల పాత్ర‌లూ క‌నిపించాలి. అలా జ‌ర‌గాలంటే విభిన్నమైన పాత్ర‌ల్ని ఎంచుకోవాలి. ప్ర‌స్తుతానికి నా ల‌క్ష్యం అదే..” అంటోంది లావ‌ణ్య‌. అంటే.. త్వ‌ర‌లోనే ఈ అమ్మ‌డు ఎక్స్‌పోజింగూ, గ‌ట్రా చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌మాట‌. లావ‌ణ్య‌లాంటివాళ్లే ఇలా అంటే.. మిగిలిన‌వాళ్ల సంగ‌తేంటి? వాళ్లు మ‌రింత రెచ్చిపోరూ…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close