కౌలు రైతుల‌కు రైతుబంధు లేద‌న్న కేసీఆర్‌..!

తెలంగాణ స‌ర్కారు రైతుబంధు ప‌థ‌కం పేరిట ఎక‌రాకి రూ. 8 వేలు పెట్టుబ‌డి అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మం కూడా జ‌రుగుతోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఉండే చాలామంది కౌలు రైతుల సంగ‌తి ఏంట‌నేదే ప్ర‌శ్నార్థ‌కంగా ఉంటూ వ‌స్తోంది. ఈ ప‌థ‌కం ద్వారా కౌలు దారుల‌కు వ్య‌వ‌సాయ పెట్టుబ‌డి కింద ప్ర‌భుత్వం ఇచ్చే సొమ్ము అంద‌దు. దీంతో ఇప్ప‌టికే కౌలు రైతులు త‌ర‌ఫున ప్ర‌తిప‌క్షాలు చాలా విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు.

కౌలు రైతుల‌కు పెట్టుబ‌డి ఇవ్వాలంటూ కొంత‌మంది నాయ‌కులు అంటున్నార‌నీ, ఎలా ఇయ్యాలి, ఏమ‌ని ఇయ్యాలి, ఏ ప‌ద్ధ‌తిలో ఇయ్యాలి అంటూ కేసీఆర్ ప్ర‌శ్నించారు. తానే ఒక రైతుని అనుకుంటే, ఈ సీజ‌న్ లో ఆరోగ్యం బాలేక‌పోయి భూమిని ఎవ‌రికో ఇస్తాన‌నీ, ఆరోగ్యం కుదుట‌ప‌డిన వెంట‌నే తానే వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని ఉద‌హ‌రించారు. ఎవ‌రి భూములను ఎవ‌రు దున్నుతున్న‌ాడో రాసుకుని కూర్చోవ‌డం త‌ప్ప ప్ర‌భుత్వానికి వేరే ప‌నిలేదా అన్నారు. అందుకే, పాసు పుస్త‌కాల్లో అనుభ‌వ‌దారు అనే కాల‌మ్ ని తీసి పారేయించాన‌నీ, ఒక ప‌ట్ట‌దారు మాత్ర‌మే ఉంటాడ‌ని చెప్పారు. ఎట్టి ప‌రిస్థితుల‌లో కౌలుదారుల‌కు డ‌బ్బులు ఇయ్యం అని స్ప‌ష్టం చేశారు. మిగ‌తాది రైతు, కౌలుదారు మ‌ధ్య జ‌రిగే ముచ్చ‌ట‌ని అన్నారు. వాళ్లూవాళ్లూ ఇచ్చుకుంటారో మానుకుంటారో అది వేరే సంగ‌తి అని తేల్చి చెప్పేశారు.

మొత్తానికి, రైతుబంధు పథకం విషయంలో కౌలుదారులకు ముట్టేదేమీ లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేసేశారు. ఏదో ఒక మ‌ధ్యే మార్గం ఉంటుంద‌ని కౌలుదారులు ఎదురుచూస్తూ వ‌స్తే.. ఇప్పుడు సీఎం ఇలా అనేశారు. ఎప్పుడో వైయ‌స్ హ‌యాంలో కౌలు రైతులు గుర్తింపులు కావ‌డం ఇవ్వ‌డం మిన‌హా… ప్ర‌భుత్వప‌రంగా వారికి చెప్పుకోద‌గ్గ ల‌బ్ధి అంద‌లేద‌నే చెప్పాలి. క‌నీసం ఈ రైతుబంధు ప‌థ‌కం ద్వారానైనా కొంత సాయం అందే అవ‌కాశం ఉంద‌ని వారూ ఆశిస్తే… చివ‌రికి ఈ విష‌యంలో కూడా ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన స్ప‌ష్ట‌త ఇచ్చేసింది. రైతుబంధు ప‌థ‌కం కింద వ‌చ్చే సొమ్మును కౌలుదారుకు ఎంత ఇవ్వాల‌నేది భూయ‌జ‌మానే నిర్ణ‌యిస్తాడ‌ని, అది ప్ర‌భుత్వం ప‌ని కాద‌ని చెప్పేశారు. ఇప్ప‌టికే ఈ కౌలు రైతుల స‌మ‌స్య‌ల్ని ప‌ట్టుకుని ప్ర‌తిప‌క్షాలు బాగానే విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. తాజా సీఎం వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మ‌రోసారి విమ‌ర్శ‌లు పెంచే అవ‌కాశం ఉంది. ఏదేమైనా, కౌలు రైతుల స‌మ‌స్య‌లపై కూడా ప్ర‌భుత్వం దృష్టి సారించాల్సి అవసరమైతే చాలా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close