‘మ‌న్మ‌థుడు’కీ ‘మ‌న్మ‌థుడు 2’కీ లింకేంటి..?

నాగార్జున త‌న కెరీర్‌లోనే తొలిసారి ఓ హిట్ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. అదే ‘మ‌న్మ‌థుడు 2’. విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మన్మ‌థుడు క్లాసికల్ హిట్ గా నిలిచింది. అందులో త్రివిక్ర‌మ్ రాసిన పంచ్‌లు, నాగ్ – సోనాలీ మ‌ధ్య కెమిస్ట్రీ, దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు.. ఇవ‌న్నీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ఇప్పుడు ‘మ‌న్మ‌థుడు 2’లో ఏం ఉండ‌బోతున్నాయ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. అస‌లు ఆ మ‌న్మ‌థుడికీ, ఈ మ‌న్మ‌థుడికీ లింకేంట‌న్న‌ది మ‌రో ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌.

క‌థా ప‌రంగా ఈ రెండు సినిమాల‌కూ ఎలాంటి పోలిక‌లూ లేవ‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. కాక‌పోతే ఒకే ఒక్క పాయింట్ క‌నెక్ట్ అయ్యింది. మ‌న్మ‌థుడులో నాగార్జున‌కు పెళ్లంటే ఇష్టం ఉండ‌దు. ఇందులోనూ అంతే. ఇందులో నాగార్జున‌కు చాలామంది అక్క‌లు, చెల్లాయిలూ ఉంటారు. వాళ్ల పెళ్లికి, త‌న పెళ్లి అడ్డుగా ఉంద‌ని… పెళ్లికి ఒప్పుకోవాల్సివ‌స్తుంద‌ట‌. అక్క‌డి నుంచి… నాగ్ క‌ష్టాలు మొదల‌వుతాయ‌ని తెలుస్తోంది. మ‌న్మ‌థుడులో పారిస్ ఎపిసోడ్ బాగా క్లిక్ అయ్యింది. అక్క‌డే ఎక్కువ భాగం షూటింగ్ చేశారు. ఈసారి.. లొకేష‌న్ పోర్చుగ‌ల్ కి షిఫ్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం అక్క‌డే కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. సినిమా మొత్తం అక్క‌డే జ‌ర‌గ‌బోతోంద‌ని, ఓ భారీ షెడ్యూల్‌తో అక్క‌డే ఈ సినిమాకి గుమ్మ‌డికాయ కొట్టేస్తార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com