తాగడాన్ని తగ్గించేందుకు బార్ల సంఖ్యను తగ్గించలేదట !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు ప్రజలను ఓ మాదిరి ఆలోచన పరులుగా కనిపించడం లేదు. తాము ఏదంటే అది నమ్ముతారని గట్టిగా అనుకుంటున్నారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి చేయకుండా బార్ల సంఖ్యను కూడా తగ్గించుకుండా కొత్త పాలసీపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం ఏమిటంటే.. మద్యం వినియోగం తగ్గించేందుకు బార్ల సంఖ్యను పెంచలేదట. అంటే.. తగ్గించలేదని కూడా అర్థం. బార్ల సంఖ్య అంతే ఉంచితే మద్యం తాగేవారు ఎలా తగ్గుతారు ? ఈ మాత్రం ఆలోచన ఈ వివరణ ఇచ్చే వారికీ ఉండదా ? ఉన్నా.. ప్రజలు తాము ఏమి చెబితే అది నమ్మేస్తారన్న నమ్మకంలో ఉన్నారు. ప్రజలు మరీ అంత అమాయకులు అయిపోయారని అనుకుంటున్నారా ?

టీడీపీ హయాంలో 840 బార్లు ఉన్నాయి. తాము రాగానే తాగేవాళ్లని తగ్గించేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం బార్ లైసెన్సులన్నీ రద్దు చేసింది. కొత్త అప్లికేషన్లు తీసుకుంది. నలభై శాతం బార్లను తగ్గించింది. కానీ ఐదేళ్లకు లైసెన్సులు ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ చేయడంపై వారు కోర్టుకెళ్లారు. అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు బార్ లైసెన్స్‌ల సమయం పూర్తయింది. అడగకపోయినా రెండు నెలల సమయం పెంచింది. కొత్త బార్ పాలసీలో గతంలో నలభై శాతం తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని రివర్స్ చేసుకుంది. అన్ని బార్లను కొనసాగిస్తోంది.

ఇదేమిటని ప్రజలు .. విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు.. పాత సమాధానం చెప్పింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకట. జిల్లాలు పెరిగినా బార్లను పెంచలేదట. ఇటీవల జిల్లాలు పెంచగానే కరెంట్ సమస్యలు వచ్చాయి. పదమూడుజిల్లాల కరెంట్ ఇరవై ఆరు జిల్లాలకు సరిపోవాలి కదా అని కొంత మంది సెటైర్లు వేశారు. జనం అంతే అమాయకంగా ఉంటారని.. జిల్లాలు పెంచినా బార్లను పెంచలేదని కవరింగ్ చేసుకుంటున్నారు. ప్రజలు అసలు ఏ మాత్రం ఆలోచనా పరులు కాదన్న గట్టి నమ్మకం ఉంటేనే ఇలాంటి సమాధానం చెప్పగలరన్న అభిప్రాయం వస్తే అది మన తప్పేం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close