చైతన్య: గెలిస్తే జగన్ గొప్ప.. ఓడితే మంత్రులపై వేటు..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తేడా వస్తే మంత్రుల పదవులు ఊడిపోతాయని.. ఎమ్మెల్యేలకు ఇక టిక్కెట్లు దొరకవని.. ఓపెన్‌గానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చేశారు. ఆ తర్వాత పదమూడు జిల్లాలను ఐదు భాగాలుగా చేసి.. ఐదుగురు పార్టీ ప్రముఖులుకు ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఇచ్చారు. ఆ ఐదుగురు రెడ్డి సామాజికవర్గం నేతలే. అయితే… వీరెవరికీ.. హెచ్చరికలు రావడం లేదు. పూర్తిగా.. మంత్రుల్ని.. ఎమ్మెల్యేల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.

సీఎం పరిపాలనకు రిఫరెండమంటున్నారుగా.. మంత్రులకెందుకు బాధ్యత..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది నెలల కాలంలో ఊహించనన్ని నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ హయాంలోని సంక్షేమ పథకాలన్నీ నిలిపివేయడండో పాటు.. కొత్తగా రైతు భరోసా.. అమ్మఒడి వంటి పథకాలు ప్రవేశపెట్టారు. మూడు రాజధానులు చేయాలనుకున్నారు. ప్లస్సులు..మైనస్సులూ చాలా ఉన్నాయి. ఓ రకంగా… ఆయన పది నెలల పాలనపై రిఫరెండమని.. వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఫలితాలు తేడా వస్తే.. ముఖ్యమంత్రి నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చినట్లే భావించాలి.. కానీ.. ఆయన మంత్రుల్ని మాత్రమే బలి చేస్తామని నేరుగానే చెబుతున్నారు. ఎక్కడైనా తేడా ఫలితాలు వస్తే.. అది ఆ మంత్రి పనితనంగానే భావించాలన్న నిర్ణయానికి రావడం వల్లే..ఇలాంటి బెదిరింపులు ప్రారంభించారన్న అనుమానం.. వైసీపీలో ప్రారంభమయింది.

మెడ మీద కత్తి పెడితే.. ఆదర్శాలు, సుభాషితాలు ఎలా పాటిస్తారు..?

మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారు.. ఆ తర్వాత విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు వార్నింగ్ లు ఇస్తున్నారు. ఫలితాలు తేడా వస్తే.. మంత్రులతే బాధ్యతని చెబుతున్నారు. పదవులు కాపాడుకోవడానికి మంత్రులు విశ్వప్రయత్నాలు చేయాల్సిందేనన్న అభిప్రాయాన్ని వారు కల్పిస్తున్నారు. విశ్వప్రయత్నాలు అంటే… మద్యం, మనీ పంపకమే. దానికి తోడు.. విపక్ష పార్టీల నేతలపై కేసులు… ఒత్తిళ్లు కూడా.. ఉంటాయి. వీటన్నింటినీ ప్రయోగించి అయినా సరే పూర్తి స్థాయి ఫలితాలు సాధించాలని.. ఒత్తిడి తెస్తున్నారు. దీని వల్ల.. ఇక ముఖ్యమంత్రి చెప్పే… ఆదర్శాలు, సుభాషితాలు పాటించడానికి వారికి అవకాశం ఎక్కడ ఉంటుంది..?

గెలిస్తే ఆ క్రెడిట్ మంత్రులకిస్తారా..?

సహజంగా అధికార పార్టీకి .. స్థానిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అధికారయంత్రాంగం చేతిలో ఉంటుంది కాబట్టి.. గెలుపు దిశగా సాగిపోతోంది. అయితే.. ఓడితే మంత్రులదే బాధ్యతంటున్న వైసీపీ నేతలు… గెలిస్తే… ఆ క్రెడిట్ మంత్రులకు ఇస్తారా అన్నది వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. అలా తమ క్రెడిట్ అని చెప్పుకోవడానికి మంత్రులుక కూడా నోరు లెగవకూడదు. గెలిస్తే.. జగనన్న పాలనకు ప్రజామోదం అంటారు. ఓడితే.. మంత్రుల తప్పిదమని ఓటేస్తారు. కిక్కురమనలేని పరిస్థితి వైసీపీ నేతలది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close