లోకేష్‌ పెంచిన వాళ్లూ ముంచుతున్నారు బాబూ!

తెలంగాణకు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. పార్టీ ఉంటుందా? అంతర్ధానమైపోతుందా? అనే అనుమానాలు కలిగే రీతిగా వాతావరణం మారిపోతున్నది. తెలుగు రాష్ట్రం రెండు ముక్కలు అయిన తర్వాత.. ఏపీలో అధికారం దక్కడంతో చంద్రబాబునాయుడు తన పూర్తి ఫోకస్‌ అక్కడే పెట్టారు. తెలంగాణ పార్టీని పట్టించుకోవడం మానేశారు. సలహాల కోసం కూడా తన వద్దకు రానే వద్దంటూ వారికి చెప్పేశారు. అలాగని ఆయన తెతెదేపా నాయకులకు పూర్తి ఫ్రీహ్యాండ్‌ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇక్కడ తన కొడుకును ప్రతినిధిలాగా పెట్టి.. అంతా తన కొడుకు కనుసన్నల్లో జరగాలన్నట్లుగా అతనికి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబెట్టి వదిలేశారు.

ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశానికి పడుతున్న దెబ్బల్లో చాలా వాటికి ‘లోకేష్‌ ఫ్యాక్టర్‌’ కారణం అని పార్టీ నాయకులు కొందరు విశ్లేషిస్తున్నారు. లోకేష్‌కు పెత్తనం ఇవ్వడం పట్ల అయిష్టత ఉన్న వాళ్లూ, లోకేష్‌కు ఇచ్చిన ప్రాధాన్యం దృష్ట్యా ఇక తమకు ఎదుగుదల ఉంటుందనే నమ్మకం లేనివాళ్లూ పార్టీని వీడి వెళ్లిపోవడం సహజం. కానీ ఊరూ పేరూ లేకపోయినా, రాజకీయ నేపథ్యం లేకపోయినా.. లోకేష్‌ ద్వారా సిఫారసు చేయించుకుని తెదేపా రాజకీయాల్లో హటాత్తుగా తెరమీదకు వచ్చి బాగా ఎదిగిన వారంతా మామూలుగా అయితే పార్టీకి రుణపడి ఉండాలి. లోకేష్‌ ప్రభావం నిజమే అయితే గనుక.. పార్టీకి విశ్వాసంగా వ్యవహరించాలి. కానీ అలాంటి వారంతా కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అందుకే ఇప్పుడు తాజాగా ”లోకేష్‌ పెంచిన వాళ్లు కూడా పార్టీని ముంచేస్తున్నారు చంద్రబాబూ!” అంటూ పార్టీ తెలంగాణ నాయకులు.. ఆయనకు ఆవేదనతో నివేదిస్తున్నారు.

లోకేష్‌కు అప్రకటిత కిరీటం కట్టబెట్టిన తర్వాత.. ఆ పెత్తనం నచ్చక వెళ్లిపోతున్నట్లు తలసాని, తీగల లాంటి వాళ్లు ప్రకటించారు. ఆ విధంగా లోకేష్‌ ద్వారా పార్టీకి ఒక నష్టం జరిగింది. తన కొడుకుకు కిరీటం మాత్రమే ముఖ్యం.. పార్టీ ఉన్నా నాశనం అయిపోయినా పర్లేదు అని భావించినట్లుగా చంద్రబాబు తాను అనుకున్న రీతిలోనే దూసుకెళ్లిపోయారు. అయితే లోకేష్‌ వలన పార్టీని వాడుకున్న వారు కూడా ఇప్పుడు దెబ్బ కొడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే వివేక్‌ కూడా తెరాసలోకి జంప్‌ చేసిన నేపథ్యంలో ఈ చర్చ మళ్లీ తెరమీదకు వస్తోంది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ తదితరులు.. ప్రత్యేకంగా, లోకేష్‌ సిఫారసుతో.. ఆయన కోటరీ మనుషులు అనే గుర్తింపుతో అడ్డదారుల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకున్నారు. ఆ మేరకు లబ్ధి పొందారు. గెలిచారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాత్రం.. పార్టీని వీడుతున్నప్పుడు.. లోకేష్‌ తనకు సన్నిహితుడని చాలా ఫీలయినట్లుగా చెబుతారు. అలాగే వివేక్‌కూడా లోకేష్‌ ద్వారానే ఎమ్మెల్యే అయ్యాడు. మరి అతన్ని లోకేష్‌ ఎందుకు ఆపలేకపోయాడు అనేది మీమాంస. అలాగే రేపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తదితరులు వెళ్లిపోయినా వారు లోకేష్‌ కోటాలో ఎదిగిన వాళ్లే!

మరి లోకేష్‌ పెంచిన వాళ్లంతా పార్టీని ఇలా నట్టేట ముంచి వెళ్లిపోతూ ఉంటే.. చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని కాపాడుకోవడానికి పుత్రప్రేమను పక్కనపెట్టి కొడుకు పెత్తనానికి కత్తెర వేస్తే తప్ప సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close