ఉద్దానంకు అండగా ప్రభుత్వం..! పవన్‌ విమర్శలకు లోకేష్ సింపుల్ రిప్లయ్..!!

ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో పవన్ కల్యాణ్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. గతంలో బాధితులందర్నీ ఓ సినిమా హాల్‌కు పిలిపించుకుని మాట్లాడిన పవన్.. పోరాటయాత్రలో టెక్కలికి పిలించుకుని మాట్లాడారు. తాను ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం.. ఎంతో చేశానని..కానీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేదని ఆవేశ పడ్డారు. తక్షణం బాధితులకు రెండు రోజుల్లో బాధితులకు న్యాయం చేయకపోతే.. శ్రీకాకుళంలో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. పవన్ కల్యాణ్‌కు ఉన్నంత ఆవేశం, ఎమోషన్ .. మంత్రి లోకేష్ చూపించలేదు. కానీ.. గత ప్రభుత్వాల కంటే మిన్నగా.. ఇంకా చెప్పాలంటే.. పవన్ కల్యాణ్ ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేసిందో.. ఓ వివరణను ట్విట్టర్‌లో పెట్టారు.

పవన్ కల్యాణ్‌కు తప్పుడు ఫీడ్ బ్యాక్ వెళ్తోందని లోకేష్ నమ్ముతున్నారు. అదే విషయాన్ని చెబుతూ…ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం తరపున ఏమేం చేస్తున్నామో వివరించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా రావడానికి… మంచినీరు ఓ సమస్యగా కొంత మంది నిపుణులు గుర్తించారు. అందుకే పలాస,వజ్రపు కొత్తూరు,కవిటి,సోంపేట,కంచిలి,ఇచ్ఛాపురం,మందసాల్లో సుమారుగా 16 కోట్ల నిధులతో 7 ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసామని లోకేష్ తెలిపారు. వీటి ద్వారా 80 గ్రామాల్లో 238 నివాస ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. ఏర్పాటు చేయాలనుకున్న 136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ లో 109 యూనిట్స్ ఏర్పాటు పూర్తి అయ్యింది. మరో 27 యూనిట్స్ ఈ నెలాఖరుకి పూర్తి కాబోతున్నాయని లోకేష్ ట్వీట్‌లో తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన డైయాలిసిస్ సెంటర్లలో డైయాలిసిస్ పొందుతున్న కిడ్నీ వ్యాధి గ్రస్తులకు 2500 రూపాయిల పెన్షన్ అందిస్తున్నామన్నారు. 4 నెలల్లో 15 మొబైల్ టీమ్స్ ఏర్పాటు …లక్ష మందికి పైగా పరీక్షలు చేశారు సోంపేటలో ఎన్టీఆర్ వైద్య పరీక్షల్లో భాగంగా నూతన ల్యాబ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటు లో ఉండేలా పలాస,సోంపేట,పాలకొండ లో 3 రినల్ డయాలసిస్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకూ 64,816 డయాలసిస్ సెషన్స్ ఈ సెంటర్లలో జరిగాయి. డయాలసిస్ సెంటర్లకు వచ్చే ఖర్చులు కూడా లేకుండా చంద్రన్న సంచార వాహనాలు ఏర్పాటు రకచేసి.. రోగులకు రవాణా సౌకర్యం కల్పించారు.

ఇక సమస్య రాకుండా చేసేందుకు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆస్టేలియా ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాల పై పరిశోధన చేయిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యల పై అధ్యయనం ప్రారభించారన్నారు. ఏదైనా అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించే ముందు క్షేత్ర స్థాయిలో ఉన్న నిజాలను బేరీజు వేసుకోవాలి అని పవన్ కల్యాణ్ ను .. లోకేష్ కోరారు. మరి లోకేష్ వివరణపై.. పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి..!ఇప్పటికే ఆయన… రెండు రోజుల డెడ్ లైన్ పెట్టి..నిరాహారదీక్ష చేస్తానని కూడా ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close