విమర్శల భయంతో పాటు, ఓట్లు పోతాయన్న ఆలోచనలతో తన ‘మనసులో మాట’ను బయటకు చెప్పే పరిస్థితుల్లో చంద్రబాబు లేడు కానీ, నిజానికి ఆయన ఆలోచనలన్నీ కూడా అల్ట్రా మోడర్న్‌గా ఉంటాయి. కమ్యూనిజం, వ్యవసాయం, ఉచితాలను పంచిపెట్టడం, చరిత్రను చదువుకోవడం లాంటి విషయాల్లో చంద్రబాబు ఒరిజినల్ ఆలోచనలకు, ఇప్పుడు ఆయన ఆచరణలో పెడుతున్న ఆలోచనలకు అస్సలు సంబంధమే ఉండదు. పాపం చంద్రబాబు….ఇక్కడ కూడా ఆయనకు రెండు కళ్ళ సిద్ధాంతం తప్పట్లేదు.
అయితే ఎంత చంద్రబాబు అయినా తన ఒరిజినల్ ఆలోచనల విషయంలో పూర్తిగా కాంప్రమైజ్ కావడం కష్టం కదా? అందుకే కొన్ని విషయాల్లో మాత్రం తన మార్క్ అభివృద్ధిని అమలు చేస్తున్నాడు. విశాఖపట్నాన్ని గోవా, బ్యాంకాక్…ఇంకా అంతకుమించి అనేలా ఫ్రీ లైఫ్ ఉండే స్థాయిలో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. గత ఏడు నెలల్లో మద్యం అమ్మకాలలో 11.65శాతం అభివృద్ధి సాధించారు చంద్రబాబు. అందులోనూ విశాఖపట్నం అయితే లిక్కర్ అమ్మకాల్లో విమానం కంటే స్పీడ్‌గా దూసుకెళ్ళిపోయింది. దాదాపు వెయ్యి కోట్లకు దగ్గరగా వచ్చి ఆంధ్రప్రదేశ్‌లోనే అగ్రస్థానాన్ని సగర్వంగా అలంకరించింది. ఈ అభివృద్ధిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం చంద్రబాబు, వెంకయ్యనాయుడుల సన్మాన కార్యక్రమాలను ఎప్పుడు షురూ చేస్తారో చూడాలి మరి. ఇక అతి త్వరలో బీచ్ ఫెస్టివల్ అనో, లవ్ ఫెస్టివల్ అనో…..పేరు ఏదైతే ఏముందిలే….మేం లవర్స్ అని చెప్పుకు తిరిగే అబ్బాయిలకు, అమ్మాయిలకు ఫ్రీ లైఫ్‌ని ఎంజాయ్ చేయడం కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాటు చేసే ప్రోగ్రాం ఏదో రాబోతోందట.
ఇకనేం……చుక్క, ముక్క, పక్కలాంటి విషయాల్లో ఫుల్ ఫ్రీడం ఇచ్చే ప్లేస్ ఒకటుందని తెలిస్తే చాలు. బోలెడుమంది లవర్స్ పోలోమని వచ్చేస్తారు. మరికొంతమంది లవ్వుని, లవర్(?)ని వెతుక్కుంటూ వస్తారు. పోలీసులు కూడా ప్రభుత్వ అధినేతల ఆలోచనలు తెలుసుకుని రూల్స్ కర్రను బయటకు తీసే టైపే కాబట్టి వాళ్ళూ సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత విశాఖలో హోటల్ ఇండస్ట్రీ, లిక్కర్ ఇండస్ట్రీ….ఇంకో రెండు మూడు యాపారాలు, యవ్వారాలు కూడా శాఖోపశాఖలుగా దినదినాభివృద్ధి చెందుతాయి. ఆ అభివృద్ధితో పాటు మహా అయితే క్రైమ్ రేట్ పెరుగుతుంది, గొల్లపూడి మారుతీరావులాంటి ప్రజలు మాది విశాఖ అని చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడొచ్చు, కొంతమంది కుర్రకారు భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోతుందేమో…. అయితేనేం విశాఖను ఇలా అభివృద్ధి చేసిన ఘనత ఎవరిది అనే ప్రశ్న వచ్చినప్పుడుల్లా… భవిష్యత్ తరాలన్నీ కూడా చంద్రబాబు పేరే చెప్పుకుంటాయిగా. ఆల్రెడీ చంద్రబాబు అనుకూల మీడియా వారు కూడా……..హైదరాబాద్‌లో కిస్ ఫెస్టివల్ నిర్వహించినప్పుడు…..వైజాగ్‌లో లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తే తప్పేంటి అన్న మా గొప్ప లా పాయింట్ లాగారు. అలాగే బోలెడన్ని కంట్రీస్‌లో….అది కూడా డెవలప్ అయిన కంట్రీస్‌లో ఫ్రీ లైఫ్ ఉంటుందిగా…. మరి ఆంధ్రప్రదేవ్ మాత్రం డెవలప్ అవ్వొద్దా…? అవ్వాలంటే ఫ్రీ లైఫ్ ఉండొద్దా….? ఉండొద్దు అన్నారంటే మాత్రం మీరు అభివృద్ధి నిరోధకులే, అరాచకవాదులే… అట్టే మాట్టాడితే జగన్ మనుషులే. ఇప్పుడు చెప్పండి….ఫ్రీ లైఫ్ ఉండాలా? వద్దా….?