ఎల్వీకి కేంద్రం ఊరట..!?

సీఎం జగన్మోహన్ రెడ్డి చేతిలో అత్యంత ఘోరమైన అవమానానికి గురైన ఎల్వీ సుబ్రహ్మణ్యం పరువు కాపాడే ప్రయత్నాన్ని బీజేపీ తలకెత్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయనను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుని కీలకమైన పదవి ఇస్తారని.. చెబుతున్నారు. దీనికి బలమైన కారణం కూడా ఉంది. ఆయన బీజేపీ లైన్‌లో ఉన్నారన్న కారణంగానే.. గెంటేశారని.. అధికారవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. బీజేపీ లైన్ అంటే.. హిందూత్వమే. ఆలయాల్లో అన్యమతస్తుల ఏరివేతకు.. ఆయన భిన్నమైన మార్గాలను అన్వేషించారు. ఆరోపణలు ఉన్న ఉద్యోగుల ఇళ్లపై ఆకస్మిక దాడులు చేయించారు. ఇతర మతాల ప్రార్థనలు చేస్తూండంగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని…. చర్యలు తీసుకున్నారు. అలాగే.. ఆలయ భూముల విషయంలో… ఏపీ బీజేపీ నేతల వాదనను సమర్థించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ భూములు .. పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం..తీసుకోకూడదనుకున్నారు.

ఓ రకంగా.. ఎల్వీ.. బీజేపీ ఎజెండానే అమలు చేసే ప్రయత్నంలో.. తన పదవి పోగొట్టుకున్నారన్న సానుభూతి… అటు బీజేపీ వర్గీయుల్లోనూ.. ఇటు బీజేపీకి మద్దతుగా ఉండే.. ఆలిండియా సర్వీసు ఉద్యోగుల్లోనూ ఉంది. అదే సమయంలో.. ఆయనను బదిలీ చేసిన స్థానంలో.. ఇంత వరకూ… సర్వీసులో ఉన్న ఏ అధికారి కూడా పని చేయలేదు. అది రిటైర్డ్ అధికారులకు ఉపాధి కల్పించే.. ఓ హోదా మాత్రమే. ఇది మరింత అవమానం కావడంతో.. ఆయనను.. కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని… బీజేపీ అగ్రనాయకత్వం వద్ద కీలక వర్గాలు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఎల్వీకి కేంద్రం నుంచి సమాచారం వచ్చిందంటున్నారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. రిటైర్ అయినప్పటికీ.. సర్వీసులో కొనసాగించే.. కీలకమైన పదవినే.. బీజేపీ ఆఫర్ చేయబోతోందన్న ప్రచారం ఢిల్లీలో ఉద్ధృతంగా సాగుతోంది. ఇదే జరిగితే.. ఏపీ అధికార వర్గాల్లో ఇప్పటి వరకూ ఉన్న ఓ ఆందోళన.. తిరుగుబాటుగా మారే ప్రమాదం కూడా ఉందన్న అంచనాలున్నాయి. కేంద్రం అండ ఉందన్న ఉద్దేశంతో.. ఇక ఐఏఎస్ అధికారులు జగన్ మాట వినరని అంటున్నారు. సీఎస్‌ను అవమానకరంగా… తొలగించేసిన వైనం.. జగన్‌కు కొంత కాలం వెంటాడుతుందన్న అభిప్రాయం మాత్రం…గట్టిగానే వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close