కేసీఆర్ పొలిటికల్ గేమ్‌లో ఇరుక్కుపోయిన మధుసూదనాచారి..!

మాజీ స్పీకర్ మధుసూదనాచారి కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ వైపు ఎన్నికల్లో ఓటమి ఆయనను బాధిస్తూండగా.. కొత్తగా కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి రావడం.. ఆయనను మరిత ఇబ్బంది పెడుతోంది. గత అసెంబ్లీలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. సహజ న్యాయసూత్రాలను పాటించలేదని.. కోమటిరెడ్డి , సంపత్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు విచారణ జరిపి వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ అప్పటి శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి పట్టించుకోలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా.. ఇది చాలా తీవ్రమైన విషయంగా పేర్కొన్న.. హైకోర్టు మధుసూదనాచారిని ప్రతివాదిగా చేర్చి సమన్లు జారి చేసింది. రాకపోతే.. అరెస్ట్ ఖాయమని తేల్చి చెప్పింది. గతంలో స్పీకర్‌ను అరెస్టుచేసి కోర్టులో హాజరు పర్చేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయని హైకోర్టు తన రూలింగ్‌లో ప్రత్యేకంగా గుర్తు చేసింది.

నిజానికి ఈ కేసులో… హైకోర్టును.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శలు లైట్ తీసుకున్నారు. గతంలో కోర్టు ఆదేశాలున్నా న్యాయశాఖ, శాసనసభ కార్యదర్శులు న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీంతో వారిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. పూచీకత్తులు చెల్లించిన మీదట విడుదల చేయాలని ఆదేసించడంతో ఇద్దరూ 40 నిమిషాల పాటు జ్యుడీషియల్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఉండి పూచీకత్తు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే ఈ కేసు విచారణలో… ప్రభుత్వ తరపున న్యాయవాదులు … హైకోర్టుపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైనా.. ధర్మాసనం.. ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి సీరియస్‌గా మారిపోయిది.

గవర్నర్ ప్రసంగం సందర్భంగా.. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి… హెడ్‌ఫోన్‌ను… విసిరేశారు…. శాసనమండలి చైర్మన్‌కు తగిలిందని.. ఆయన కంటికి గాయం అయిందని…చెబుతూ… కోమటిరెడ్డితో పాటు.. సంపత్‌పైనా అనర్హతా వేటు వేశారు. రాత్రికి రాత్రే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై వారిద్దరూ హైకోర్టుకు వెళ్లారు. సాక్ష్యాలున్నాయని.. హైకోర్టులో ప్రవేశపెడతామని.. అప్పటి అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం.. దానికి నిరాకరించి.. అడ్వకేట్ జనరల్ ను తప్పించింది. అప్పట్నుంచి… ఆ విచారణ సాగి సాగి..ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. కొసమెరుపేమిటంటే… అప్పట్లో అనర్హతా వేటుకు గురయిన.. కోమటిరెడ్డి, సంపత్ మళ్లీ గెలవలేదు. స్పీకర్ కూడా.. ఓడిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close