శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ ప్రత్యక్ష ప్రసారం చేయాలా..?

తిరుమల తిరుపతి దేవస్థానాలను వివాదాలు విడిచి పెట్టడం లేదు. మహాసంప్రోక్షణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ.. హైకోర్టులో దాఖలైన పిటిషన్ టీటీడీకి కొత్త తలనొప్పుకు తెచ్చిపెడుతోంది. ప్రతి పన్నెండేళ్లకోసారి చేసే మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఆదేశించాలంటూ కొందరు వ్యక్తులు ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆలయ వ్యవహారాలలో కోర్టు జోక్యం చేసుకోదంటూనే ప్రత్యక్ష ప్రసారం చేయ్యడానికి వున్న ఇబ్బందులు తెలియజేయాలని హైకోర్టు టీటీడిని ఆదేశించింది.మహా సంప్రోక్షణను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఆగమాలు ఒప్పుకోవని..వెండి వాకిలి దాటి కెమెరాలకు అనుమతి లేదని టీటీడీ కోర్టుకు తెలిపింది. అయితే పిటిషనర్లు మరింత తెలివిగా వ్యవహరించారు. అరవై ఏళ్ల కింద జరిగిన ప్రత్యక్ష ప్రసారం జరిగిందంటూ… కొన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

1958లో జరిగిన మహాసంప్రోక్షణ కార్యక్రమాని ప్రత్యక్ష ప్రసారం చేశారని అప్పట్లో లేని ఇబ్బందులు ఇప్పడు ఏమిటని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు మరో సారి టీటీడిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో టీటీడీ యంత్రాంగం ఆగమ పండితులు, ప్రధాన అర్చకులతో సమావేశం నిర్వహించి హైకోర్టు ఆదేశాలను వారికి తెలియజేసి వారి అభిప్రాయాలను తీసుకొంది. ఆగమపండితులు మాత్రం ప్రత్యక్ష ప్రసారం ఆంశంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రత్యక్ష ప్రసారం చేయ్యడం ఆగమ విరుద్దమని….శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి దాటి కెమెరాలకు ప్రవేశం లేదని తేల్చి చెప్పారు. 1958వ సంవత్సరంలో జరిగిన ఘటనకు ఆ వెంటనే ప్రాయశ్చిత్తాన్ని కూడా నిర్వహించారని టీటీడీ అధికారులకు ఆగమ పండితులు తెలిపారు.

ప్రస్తుతం టీటీడీ అధికారుల పరిస్ధితి ఆగమగోచరంగా మారింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక…తలలు పట్టుకుంటు్నారు. ఆగమ పండితుల నిర్ణయాన్నే హైకోర్టుకు తెలియజేయాలని నిర్ణయించారు. హైకోర్టు ప్రత్యక్ష ప్రసారం చేయమంటే తప్పకుండా కోర్టు ఆదేశాలను పాటిస్తామని కూడా కౌంటర్ లో చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఒక వేళ హైకోర్టు ప్రత్యక్ష ప్రసారం చేయమని ఆదేశిస్తే ఆగమపండితులు ఎలా స్పందిస్తారోనన్న టెన్షన్ టీటీడీకి పట్టుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close