మ‌హా స‌ముద్రం నా రీ లాంఛ్‌: సిద్దార్థ్‌

బొమ్మ‌రిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా? లాంటి సినిమాల‌తో సునామీలా విరుచుకుప‌డ్డాడు.. సిద్దార్థ్‌. యంగ్ హీరోల్లో త‌న‌కంటూ ఓ క్రేజ్ సంపాదించాడు. భాషా బేధం లేకుండా సినిమాలు చేశాడు. అయితే.. ఆ త‌ర‌వాత త‌న కెరీర్ గ్రాఫ్ అమాంతం ప‌డిపోయింది. ఎక్క‌డ సినిమా చేసినా క‌ల‌సి రాలేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు దాదాపుగా ట‌చ్ లోనే లేకుండా పోయాడు. ఇప్పుడు… ఇంత కాలానికి ‘మ‌హా స‌ముద్రం’తో మ‌ళ్లీ ప‌ల‌క‌రిస్తున్నాడు. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. శ‌ర్వా కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ”అంద‌రూ ఇది నా క‌మ్ బ్యాక్ సినిమా అంటున్నారు. కానీ న‌న్ను నేను రీ లాంచ్ చేసుకుంటున్నా” అని అంటున్నాడు శ‌ర్వా. అంతేకాదు స‌హ న‌టుడు శ‌ర్వాని పొగ‌డ్త‌ల‌తో ముంచేశాడు.

”ఇది మ‌ల్టీస్టార‌ర్ సినిమా అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇది శ‌ర్వా సినిమా. నేను త‌న ప‌క్క‌న నిల‌బ‌డే అవ‌కాశం నాకొచ్చింద‌ని గ‌ర్విస్తున్నా. త‌న వ‌ల్లే ఈ సినిమా పట్టాలెక్కింది. త‌న వ‌ల్లే ఈ సినిమాకి ఇంత బ‌డ్జెట్ వ‌చ్చింది. త‌న వల్లే ఈ సినిమా మాస్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా వ‌ల్ల నాకేం వ‌స్తుంది? నా న‌ట‌న గురించి ఎలా మాట్లాడుకుంటారో నాకు తెలీదు. కానీ శ‌ర్వా నాకు దొరికాడు. త‌న‌కి ఐ ల‌వ్ యూ” అంటూ శ‌ర్వాపై త‌న ప్రేమ‌ని కురిపించేశాడు సిద్దార్థ్‌. ఎన్ని భాష‌ల్లో సినిమాలు చేసినా, త‌ను తెలుగు న‌టుడిగానే చెప్పుకుంటాన‌ని, తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌కంత‌టి స్థానాన్ని ఇచ్చార‌ని, ఇక నుంచి తెలుగు సినిమాలు వ‌దిలి పోన‌ని మాటిచ్చాడు సిద్దార్థ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close