త్వ‌ర‌లో శ్రీ‌రెడ్డి ‘మ‌హా’ మ‌సాలా మూవీ!

సినిమా తార‌ల చీక‌టి బాగోతాల‌కు ఈమ‌ధ్య కేరాఫ్‌గా నిలిచింది మ‌హా టీవీ. శ్రీ‌రెడ్డి లాంటివాళ్ల‌ని రంగంలోకి దింపి..మాంఛి మ‌సాలా వార్త‌లు వండుతోంది. శ్రీ‌రెడ్డి ఇంట‌ర్వ్యూతో మ‌హా కాస్త షేక్ చేయ‌గ‌లిగింది. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి రంగం సిద్దం చేస్తోంద‌ని టాక్‌. టాప్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల త‌న‌యుల అక్ర‌మ భాగోతాల‌ను బ‌య‌ట‌పెడ‌తాం చూడండి… అంటు మ‌హా టీవీ చెబుతోంది. ఇప్పుడు ఆ అంకానికి రంగం సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. శ్రీ‌రెడ్డి ఇచ్చిన స‌మాచారం. మ‌హా చేసిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌ల వ‌ల్ల‌…. ఆ ఛాన‌ల్‌కి కాస్త ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ దొరికింది. కొన్ని ప‌డ‌క‌గ‌ది వీడియోలూ ల‌భ్య‌మ‌య్యాయి. వాటిని.. త్వ‌ర‌లో ‘మ‌హా’లో చూపిస్తార్ట‌. దాంతో… శ్రీ‌రెడ్డితో చ‌నువుగా ఉన్న కొంత‌మంది హీరోలు, నిర్మాత‌ల త‌నయులు ఇప్పుడు షేక్ అవుతున్నారు. ఇప్ప‌టికే శ్రీ‌రెడ్డితో కొంత‌మంది రాజీకి వ‌చ్చార‌ని, ‘మా బాగోతం బ‌య‌ట‌పెట్టొద్దు’ అంటూ వేడుకున్నార‌ని తెలుస్తోంది. శ్రీ‌రెడ్డి అనూహ్యంగా ఇప్పుడు అపోలో ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు స‌మాచారం. లోబీపీతో బాధ‌ప‌డుతున్న శ్రీ‌రెడ్డి ఇప్పుడు చికిత్స పొందుతోంద‌ట‌. అయితే మ‌హా టీవీ మాత్రం ఈ ఎక్స్‌క్లూజీవ్ ఫుటేజీని వాడుకుని త‌మ ఛాన‌ల్ ప‌ర‌ప‌తి, రేటింగులు పెంచుకోవాల‌ని భావిస్తోంది. శ్రీ‌రెడ్డి ఇచ్చిన ఫుటేజీ వ‌ల్ల‌… మ‌హా మైలేజీ పెరుగుతోంది కాబ‌ట్టి శ్రీ‌రెడ్డికి తృణ‌మో ప‌ణ‌మో ఇచ్చార‌న్న గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి. మ‌రి శ్రీ‌రెడ్డి వ‌ల్ల త్వ‌ర‌లో బ‌జారెక్కనున్న ఆ హీరోలెవ‌ర‌న్న‌ది తేలాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com