మ‌హాన‌టి టీజ‌ర్‌: స‌్వ‌ర్ణ‌యుగంలోకి ప్ర‌యాణం

సావిత్రి ఓ అద్భుతం అంతే! సావిత్రి స్థానాన్ని భ‌ర్తీ చేసే కథానాయిక మ‌ళ్లీ పుట్ట‌లేదు…. పుట్ట‌బోదు కూడా. అందుకే ఆమె మ‌హాన‌టి అయ్యింది. త‌న క‌థ‌ని ఇప్పుడు నాగ అశ్విన్ మ‌హాన‌టి పేరుతో ఓ సినిమాగా మ‌లుస్తున్నాడు. ఆ పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించింది. స‌మంత‌, మోహ‌న్ బాబు, దుల్క‌ర్ స‌ల్మాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. మే 9న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు టీజ‌ర్ వ‌చ్చింది. సావిత్రిగా కీర్తి సురేష్ ఎలా ఉంటుందో చూపించ‌డానికి ఈ టీజ‌ర్‌ని వాడుకున్నారు. సావిత్రిగా కీర్తి అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోయింది. కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫ్రేముల్లో అయితే… నిజంగా సావిత్రిని తీసుకొచ్చి కెమెరా ముందు నిల‌బెట్టారా? అనే సందేహం కూడా క‌లుగుతుంది. టీజ‌ర్‌కి ఇచ్చిన నేప‌థ్య సంగీతం, క‌నిపించిన సెట్స్‌, కాస్ట్యూమ్స్ మ‌ళ్లీ మ‌న‌ల్ని ఆ స్వ‌ర్ణ‌యుగంలోకి తీసుకెళ్లేలా అనిపించాయి. సావిత్రి జీవితంలోని కొన్ని ముఖ్య ఘ‌ట్టాల్ని అక్క‌డ‌క్క‌డలా మెరుపుల్లా చూపిస్తూ.. ఈ టీజ‌ర్‌ని క‌ట్ చేశారు. ఒక్క డైలాగ్ ఉంటే బాగుండును అనిపిస్తే.. అది వీక్ష‌కుడి త‌ప్పు కాదు. డైలాగ్ ఉండి ఉంటే… నిజంగానే ఈ టీజ‌ర్‌కి ఓ ప‌రిపూర్ణ‌త వ‌చ్చి ఉండేది. మొత్తానికి మ‌హాన‌టి టీజ‌ర్‌… ఈ సినిమాపై ఆస‌క్తిని రెట్టింపు చేసింది. మ‌రి మ‌హాన‌టిగా కీర్తి సురేష్ విశ్వరూపం ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.