మహేష్ బాబు.. అల్లు అర్జున్.. ఎందుకీ ఈగోలు ?!

మహా శివరాత్రికి తమ కొత్త సినిమా టీజర్లు, ట్రైలర్లతో అభిమానులను అలరిస్తారనుకుంటే.. పోటాపోటీ ప్రకటనలతో ఫ్యాన్స్ ను సైతం గందరగోళంలోకి నెట్టేశారు ఓ ఇద్దరు స్టార్ హీరోలు. ఇద్దరూ వంద కోట్లు కొల్లగొట్టేసే స్టామినా వున్న స్టార్లు. ఇప్పటికే ఈ సినిమాల వ్యాపారం అంతకుమించి జరిగింది. అలాంటి సినిమా రిలీజ్ ను ఎంత పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ ప్లానింగ్ పక్కకు పెట్టి ‘పోటి’కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది వీరి వ్యవహారం. ఈ హీరోలు ఎవరో కాదు. ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంకొకరు స్టయిలీస్ స్టార్ అల్లు అర్జున్.

మహేష్ బాబు ”భరత్ అనే నేను”, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలు సెట్స్ పై వున్నాయి. రెండు భారీ సినిమాలు. వందకోట్లు బిజినెస్ చేయగల స్టామిన వున్న చిత్రాలు. రెండు సినిమాలపై భారీ అంచనాలు వున్నాయి. అయితే అంతే భారీగా ఈ సినిమాల మధ్య పోటి కూడా కనిపిస్తుంది మొదటి నుండి. అల్లు అర్జున్ నాపేరు సూర్య సినిమాని ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. ఆ మరుసటి రోజే మహేష్ భరత్ అనే నేను ప్రకటన కూడా అదే డేట్ కి వచ్చింది. తాజాగా నా పేరు సూర్యని ఏప్రిల్ 26కి మార్చారు. అంటే ఒకరోజు ముందుకు జరిపారు. విచిత్రం ఏమిటంటే.. ఈ ప్రకటన వచ్చిన గంట వ్యవధిలోనే మహేష్ సినిమా కూడా ఏప్రిల్ 26కే రిలీజ్ అని ప్రకటించారు. దీంతో ఇండస్ట్రీలో వుండే ఈగోలు, పోటీలు మరోసారి బయటపడినట్లయింది.

కచ్చితంగా ఇవి పోటాపోటిగా వచ్చిన ప్రకటనలనే చెప్పాలి. వీరి మధ్య ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఈ ప్రకటనలు గంధరగోళానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒక్క సినిమా మాత్రమే ఆ డేట్ కి వస్తుంది. అయితే ఆ సినిమా ఏది ? ఏ సినిమా వెనక్కి తగ్గుతుంది? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా వుంది. రెండు కూడా భారీ సినిమాలు. కోట్లపెట్టుబడి, కోట్ల వ్యాపారం జరిగింది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం ఇలా పోటి పడితే నష్టపోయేది మాత్రం పంపిణీదారులే. ఇదివరకూ రెండు బడా సినిమాలు పోటి పడిన సందర్భాలు వున్నాయి. అయితే వాటి మధ్య కనీసం రెండు రోజుల గ్యాప్ అయినా వుండేది. కాని మహేష్, బన్నీ ల ప్రకటనలు చూస్తుంటే పోటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

అన్నట్టు.. ఏప్రిల్ 27కి రజనీకాంత్ ‘కాలా’ సినిమా వుంది. రజనీ సినిమా గురించి చెప్పక్కర్లేదు. సినిమా అభిమానులు అందరూ రజనీకాంత్ అభిమానులే. సినిమా ఎలావున్నా ఒకవారం రోజులు దున్నేస్తాడు రజనీ. కబాలి సినిమా దీనికి మంచి ఉదాహరణ. సినిమా అట్టర్ ఫ్లాఫ్ అన్నారు కానీ వసూళ్లు మాత్రం ఈజీగా వందకోట్లు దాటిపోయాయని ట్రేడ్ లెక్కలు చెప్పాయి. ఒకవేళ సినిమాకి హిట్ అనే టాక్ వస్తే మాత్రం ఆ ప్రభంజనం మాములుగా వుండదు. తర్వాత వచ్చిన సినిమాకి టాక్ కొంచెం తేడా వచ్చినా.. ఇంక రజనీ వైపే చూస్తారు జనాలు. ఒకవేళ రెండు సినిమాలు బావున్నా సరైనా ఓపెనింగ్స్ దక్కడం కష్టం. దినికితోడు ఇప్పుడు ఆ పైరసీ రాక్షసి నుండి సినిమాని వారం రోజులు కాపాడుకోవడమే గగనమైపోతుంది. అలాంటింది మొదటి వారం కాస్త ఇలాంటి పోటి వాతావరణంలో కొట్టుకుపొతే మాత్రం నష్టపోయిది సినిమాని పంపీణీదారులే అన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ఏప్రిల్ 26 అంటే అదేం స్పెషల్ డేట్ ఏమీ కాదు. వేసవి సీజన్ చాలా పెద్దది. తీరిగ్గా డేట్స్ దొరుకుతాయి. ఆ డేట్ కే వచ్చేయాలనే తొందర ఏమీ లేదు. పైగా ఈ రెండు సినిమాల తర్వాత ఇంకొ పెద్ద సినిమా కనుచూపు మేరలో కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా ఏ స్టార్ హీరో సినిమా తీసుకున్న ఈ ఏడాది చివర్లో తప్పితే ప్రదమార్ధంలో వచ్చే సినిమా ఒక్కటీ కనిపించడం లేదు.రజనీ 2.0వున్నా.. ఇది వీటికి పోటి వచ్చే డేట్ కి ఐతే రాదు. ఇలాంటి పరిస్థితిలో మహేష్, అల్లు అర్జున్ ఎందుకిలా పోటిపడి, గంధరగోళానికి గురౌతున్నారో అర్ధం కావడం లేదు. లేనిపోనీ ఈగోలకు పోయి ఇలా పోటి పడటం కూడా ప్రేక్షకుల్లోకి చెడు సంకేతాలు పంపినట్లువుతుంది. సినిమా అంటే వ్యతిగత వ్యవహారం కాదు కదా. నిర్మాత, హీరో ఎవరు కానీ కోట్లతో ముడిపడిన వ్యాపారాన్ని ఇలా పోటాపోటిగా రిస్క్ చేయడం కరెక్ట్ కాదు. తేడా వస్తే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ విషయంలో ఇరు పక్షాలు కూర్చుని సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close