మ‌హేష్ క్లారిటీ: త్వ‌ర‌లో.. త్రివిక్ర‌మ్‌తో

కొన్ని కాంబినేష‌న్ల కోసం అభిమానులే కాదు, చిత్ర‌సీమ యావ‌త్తూ ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటుంది. అలాంటి కాంబోల్లో మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌ల‌ది ఒక‌టి. వీరిద్ద‌రూ జాయింటుగా రెండు సినిమాలు తీశారు. ఒక‌టి.. అత‌డు, రెండోది ఖ‌లేజా. నిజం చెప్పాలంటే అత‌డు థియేట‌ర్ల‌లో కంటే, టీవీల్లో ఎక్కువ‌గా ఆడింది. ఖ‌లేజా థియేట‌ర్ల‌లో న‌డ‌వ‌లేదు కానీ, టీవీల్లో తెగ చూశారు. క‌మ‌ర్షియ‌ల్ గా పే బ్యాక్ చేసిన సినిమాలు కావివి. అయినా స‌రే.. ఈ రెండు సినిమాలూ ఓ మార్క్‌ని క్రియేట్ చేశాయి. అందుకే ఈ కాంబో హ్యాట్రిక్ ఎప్పుడు కొడుతుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు మ‌హేష్ కూడా ఈ కాంబినేష‌న్ పై క్లారిటీ ఇచ్చేశాడు. `అతి త్వ‌ర‌లోనే మా కాంబినేషన్ రాబోతోంది` అంటూ హింట్ ఇచ్చేశాడు. ఖ‌లేజా విడుద‌లై ఈరోజుకి ప‌దేళ్లు. ఈ సంద‌ర్భంగా అభిమానులంతా ఖ‌లేజా జ్ఞాప‌కాల్లో మునిగిపోయారు. మ‌హేష్ కూడా.. ఖ‌లేజా నాటి వ‌ర్కింగ్ వీడియో ఒక‌టి అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ సినిమాతోనే నటుడిగా త‌న‌ని తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకున్నాన‌ని, ఇదంతా త్రివిక్ర‌మ్ వ‌ల్లే అని గుర్తు చేసుకున్నాడు. త‌మ త‌దుప‌రి సినిమా అతి త్వ‌ర‌లో రానున్న‌ద‌ని, దాని కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని ట్వీట్ చేశాడు. ఇటీవ‌ల మ‌హేష్ – త్రివిక్ర‌మ్ మ‌ధ్య కొన్ని చ‌ర్చ‌లు న‌డిచాయి. వీరి కాంబో ఖాయ‌మ‌ని వార్త‌లొచ్చాయి. మ‌హేష్ ట్వీట్ చూస్తుంటే, అతి త్వ‌ర‌లో ఆ శుభ‌వార్త చెవిన ప‌డేలానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close