మురుగ‌దాస్‌ని హ‌ర్ట్ చేసిన మ‌హేష్ ఫ్యాన్స్‌

మురుగ‌దాస్‌పై మ‌హేష్ అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. ఫ‌స్ట్ లుక్ విష‌యంలో మురుగ‌దాస్ జాప్యం చేయ‌డం, మ‌హేష్ సినిమాకి సంబంధించిన ఎలాంటి విష‌యాలూ బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోవ‌డం, సినిమా అప్ డేట్స్ తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్రిన్స్ ఫ్యాన్స్ బాగా ఫీలైపోతున్నారు. దాంతో మురుగదాస్ ట్విట్ట‌ర్‌ని ల‌క్ష్యంగా చేసుకొని కొన్ని పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. అందులో బండ బూతులు కూడా ఉంటున్నాయి. మురుగ‌దాస్ సినిమాతో బిజీగా ఉంటాడు, ట్విట్ట‌ర్ ఎక్క‌డ ఫాలో అవుతాడులే… అనుకొంటే పొర‌పాటే. మురుగ‌దాస్ ప్ర‌తీ ట్వీట్‌ని నిశితంగా ప‌రిశీలిస్తుంటాడ‌ట‌. తెలుగులోట్వీట్ చేస్తే.. దాని అర్థాన్ని అడిగి మ‌రీ తెలుసుకొంటాడ‌ట‌. అలా మురుగ‌దాస్‌ని తిడుతూ మ‌హేష్ పెట్టిన కొన్ని పోస్టులు మురుగ‌దాస్ ని హ‌ర్ట్ చేశాయ‌ని తెలుస్తోంది.

బుధవారం మహేష్ సినిమా ఫస్ట్ లుక్‌ని బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. నిజానికి ఈమ‌ధ్య‌న ఎన్నో పండ‌గ‌లు వ‌చ్చాయి వెళ్లాయి. ఈనెల 12వ తేదీకి ఎలాంటి ప్రాముఖ్యం లేదు. అయినా స‌రే.. ఫ‌స్ట్ లుక్ వ‌దిలేయ‌డానికి కార‌ణం.. మ‌హేష్ ఫ్యాన్స్ తీసుకొచ్చిన ఒత్తిడే అని తెలుస్తోంది. మ‌రోవైపు మ‌హేష్ కూడా ‘ఏదో ఒక‌టి రిలీజ్ చేసేయండి.. మ‌రీ ఆల‌స్యం అవ్వ‌డం కూడా మంచిది కాదు’ అంటూ మురుగ‌దాస్ కి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. నిజానికి ఈమ‌ధ్య ఫ‌స్ట్ లుక్ త‌దిత‌ర వ్య‌వ‌హారాల‌పై ఫోక‌స్ చేసేంత టైమ్ మురుగ‌దాస్‌కి లేక‌పోవ‌డం వ‌ల్ల‌.. దానిపై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌లేద‌ని, కేవ‌లం మ‌హేష్ ఫ్యాన్స్ హ‌ర్టవుతున్నార‌న్న కార‌ణంతోనే ఇప్పుడు స‌డ‌న్‌గా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేస్తున్నార‌ని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close