‘వి’ సినిమాపై మ‌హేష్ ఆస‌క్తి‌

వెబ్ సిరీస్‌ల‌పై స్టార్లు దృష్టి పెడుతున్నారు. మంచి కంటెంట్ ఉంటే…. వెబ్ సిరీస్‌కీ, సినిమాకీ పెద్ద తేడా లేదు కూడా. తాజాగా మ‌రో యువ హీరో సుధీర్ బాబు కూడా వెబ్ సిరీస్‌ల‌పై ఆస‌క్తి చూపిస్తున్నాడు. “వెబ్ సిరీస్‌లు చేయాల‌న్న ఆస‌క్తి ఉంది. ఒక‌ట్రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. వాటిపై ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. వెబ్ సిరీస్‌ల‌ను నిర్మించే ఆలోచ‌న కూడా ఉంది..” అంటూ త‌న ఇష్టాల్ని వెలిబుచ్చాడు సుధీర్ బాబు. త‌ను ఓ క‌థానాయ‌కుడిగా న‌టించిన `వి` అమేజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానుంది. నిజానికి ఈ సినిమా థియేట‌ర్లోనే చూడాల‌న్న‌ది సుధీర్ బాబు అభిమ‌తం. కానీ కుద‌ర‌ని ప‌క్షంలోనే.. ఓటీటీకి ఇచ్చేశారు.

“థియేట‌ర్లో విడుద‌ల చేస్తే మ‌రింత బాగుండేది. కానీ.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. ఓటీటీ కూడా చ‌క్క‌టి ప్ర‌త్యామ్నాయంగా మారింది. ఈ సినిమా ఎక్కువ మందికి చేరువ అయితే థియేట‌ర్లో విడుద‌ల కాలేద‌న్న లోటు తీరిపోతుంది” అని చెప్పుకొచ్చాడు సుధీర్ బాబు. ఈ సినిమా గురించి మ‌హేష్ బాబు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడ‌న్నాడు సుధీర్‌. “వి ట్రైల‌ర్ మ‌హేష్‌కి బాగా న‌చ్చింది. నా యాక్ష‌న్ పార్ట్ గురించి ఆరా తీశాడు. సినిమా చూడ్డానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అన్నాడు. ఇంద్ర‌గంటి సినిమాలంటే త‌‌న‌కు చాలా ఇష్టం. స‌మ్మోహ‌నం ఆయ‌న‌కు మ‌హేష్‌కి బాగా న‌చ్చింది“ అన్నాడు సుధీర్‌బాబు. మ‌రి `వి` సినిమా చూశాక మ‌హేష్ ఏమంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close