‘మహేష్ అనే దర్శకుడు’… వస్తాడండోయ్!

గెట్టింగ్ ఇన్‌టు డైరెక్షన్ మైట్ హ్యాపెన్ మచ్ లేటర్ (దర్శకుడిగా రావడమనేది చాలా రోజులు తరవాత జరగవచ్చు) – ఆంగ్ల పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సూప‌ర్‌స్టార్‌ మ‌హేశ్‌బాబు. దీని అర్థం… భవిష్యత్తులో మ‌హేశ్‌ని దర్శకుడిగా చూడవచ్చు అనే కదా!

‘మిమ్మల్ని దర్శకుడిగా ఎప్పుడు చూస్తాం?’ అని మ‌హేశ్‌బాబుని ప్రశ్నిస్తే… “ఇప్పట్లో చూడకపోవచ్చు. ప్రస్తుతం నటనను ఎంజాయ్ చేస్తున్నా. దర్శకత్వంలోకి రావడమంటూ జరిగితే చాలా రోజుల తరవాత జరుగుతుంది” అని సమాధానం ఇచ్చారు. వెండితెరపై ‘మహేష్ అనే నటుణ్ణి’ చూస్తోన్న ప్రేక్షకుల ముందు భవిష్యత్తులో ‘మహేష్ అనే దర్శకుడు’ వస్తాడన్నమాట. ఈ ఏడాది మహేష్ సోదరి మంజుల ‘మనసుకు నచ్చింది’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కతో పోలిస్తే మహేష్ ఆలస్యంగా వస్తున్నాడంతే.

మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన ‘భరత్ అనే నేను’ మరో ఆరు రోజుల్లో విడుదలవుతోంది. విడుదల, ప్రచార కార్యక్రమాలు పూర్తయ్యాక, నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తరవాత జూన్ నెలలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరోగా నటించే సినిమా షూటింగు స్టార్ట్ చేయనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.