మ‌హేష్‌తో సైన్స్ ఫిక్ష‌న్‌?

బోయ‌పాటి శ్రీ‌ను కాస్త ట్రాక్ మార్చాడ‌నిపిస్తోంది. మాస్‌, యాక్ష‌న్ ద‌ర్శ‌కుడిగా ముద్ర‌ప‌డ్డ బోయ‌పాటి…. జ‌య‌జాన‌కి నాయ‌క‌తో ప్రేమ‌క‌థ ఎంచుకొన్నాడు. ఇందులో యాక్ష‌న్ అంశాలున్నా.. బేసిగ్గా జ‌య జాన‌కి నాయ‌క ల‌వ్ స్టోరీనే. మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేయాల‌న్న‌ది బోయ‌పాటి ఆలోచ‌న‌. ద‌మ్ము స‌మ‌యంలోనే మ‌హేష్‌కి ఓ క‌థ వినిపించాడు. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌హేష్ – బోయ‌పాటి సినిమా ఫిక్స‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ‘త్వ‌ర‌లోనే మ‌హేష్‌తో ఓ సినిమా చేస్తున్నా’ అని బోయ‌పాటి చెప్పేశాడు. ఆ సినిమా క‌థ కూడా కొత్త‌గా ఉంటుంద‌ని, షాకింగ్ జోన‌ర్ అని హింట్ ఇస్తున్నాడు బోయ‌పాటి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం… ఇదో సైన్స్ ఫిక్ష‌న్ అని తెలుస్తోంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంద‌ట‌. వ‌ర్కింగ్ డేస్ కూడా చాలా పెద్ద మొత్తం లో అవ‌స‌రం అయ్యాయ‌ట‌. ఈ ప్రాజెక్టుమీదే క‌నీసం యేడాదైనా కేటాయించాలట‌. మ‌హేష్ యేడాదికి రెండు సినిమాలు చేసే మూడ్‌లో ఉన్నాడిప్పుడు. ఆ టైమ్ ఓ సినిమాకి కేటాయించాలంటే బాగా ఆలోచించాలి క‌దా? అందుకే… మ‌హేష్ నుంచి ఇంకా ఎలాంటి స‌మాధానం రాలేద‌ట‌. లైన్ మాత్రంగా క‌థ చెప్పాడ‌ని, అతి త్వ‌ర‌లో మ‌హేష్ – బోయ‌పాటిల మ‌ధ్య మ‌రో సిట్టింగ్ జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. మొత్తానికి బోయ‌పాటి ట్రెండ్ మార్చాడు. ఇది శుభ‌సూచ‌క‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close