మెగా అభిమానులు మ‌న‌సు గెలుచుకొన్న మ‌హేష్‌

మెగాస్టార్ అంటే మ‌హేష్‌బాబుకి ముందు నుంచీ అభిమాన‌మే. దాన్ని వీలైన‌ప్పుడ‌ల్లా చాటుకొంటూనే ఉన్నాడు. ”త‌దుప‌రి మెగా స్టార్ మీరే అని జ‌నాల న‌మ్మ‌కం. మ‌రి మీరేమంటారు..??” అనే ఓ ప్ర‌శ్న మ‌హేష్‌కి చాన్నాళ్ల క్రిత‌మే ఎదురైంది. దానికి మ‌హేష్ ఏం పొంగిపోలేదు. ”మెగాస్టార్ ఒక్క‌రే… అలా పిలిపించుకొనే అర్హ‌త చిరంజీవిగారికే ఉంది” అని చిరుపై త‌న‌కున్న ప్రేమ బ‌య‌ట‌పెట్టాడు. ఇప్పుడూ అంతే. ”సూప‌ర్ స్టార్ అన‌గానే మీకు గుర్తొచ్చే వ్య‌క్తి ఎవ‌రు” అని అడిగితే.. త‌న తండ్రి పేరు చెప్ప‌లేదు. ”చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌” అంటూ మ‌ళ్లీ చిరు అభిమానిగానే మాట్లాడాడు.

”సినిమాల‌కు, వాటి ఫ‌లితాల‌కూ అతీతంగా ప్రేమించే వ్య‌క్తులు కొంత‌మంది ఉంటారు. వాళ్ల సినిమా అన‌గానే ఓ పిచ్చితో చూడ్డానికి వెళ్లిపోతారు. అలాంటి ఇమేజ్ ద‌క్కించుకోవ‌డం చాలా క‌ష్టం. తెలుగులో చిరంజీవి గారికీ, త‌మిళంలో ర‌జ‌నీకాంత్ గారికీ ఆ హోదా ద‌క్కింది” అంటూ నిజాయ‌తీగా త‌న మ‌న‌సుని ఆవిష్క‌రించాడు. మ‌హేష్ మాట‌ల‌కు మెగా అభిమానులు మొత్తం మురిసిపోతున్నారు. మ‌హేష్ వాళ్ల మ‌న‌సుల్ని నూటికి నూరు పాళ్లూ గెలుచుకొన్నాడు. రాబోయే `స్పైడ‌ర్‌` కి… ఈ మాట‌లు మేలు చేస్తాయ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అయితే.. మ‌హేష్ ఏం త‌న స్వార్థం కోసం ఇలాంటి కామెంట్లు చేయ‌లేదు. నిజంగానే త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ల్ని ఆవిష్క‌రించాడు. ఆ విష‌యంలో మ‌హేష్ నిజాయ‌తీని శంకించాల్సిన అవ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close