సందీప్ రెడ్డి క‌థ వ‌దిలేసిన మ‌హేష్ బాబు

‘అర్జున్ రెడ్డి’తో సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమాని బాలీవుడ్‌లో త‌నే తెర‌కెక్కిస్తున్నాడు. ఈలోగా సందీప్ కి తెలుగులో చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అందులో మ‌హేష్ బాబు తో సినిమా ఒక‌టి. సందీప్ – మ‌హేష్ ల మ‌ధ్య చాలాసార్లు భేటీ జ‌రిగింది. ఓ క‌థ మ‌హేష్‌కి వినిపించ‌డం, దాన్ని మ‌హేష్ ఓకే చేయ‌డం అయిపోయాయి. మ‌హేష్ డేట్లు ఇవ్వ‌డ‌మే త‌రువాయి.

అయితే.. ఇప్పుడు ఈ స్క్రిప్టుని మ‌హేష్‌బాబు ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. చాలా ర‌కాలుగా ఆలోచించిన త‌ర‌వాతే మ‌హేష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. క‌థ బాగున్నా, ఆ క్యారెక్ట‌రైజేష‌న్ త‌న ఇమేజ్‌కి స‌రిపోద‌ని మ‌హేష్ భ‌య‌ప‌డుతున్నాడ‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని సందీప్‌కీ చెప్పేశాడ‌ట‌. ‘ఈ క‌థ అయితే వ‌ద్దు.. భ‌విష్య‌త్తులో మాత్రం త‌ప్ప‌కుండా ప‌నిచేద్దాం..’ అని సందీప్‌కి మాట ఇచ్చిన‌ట్టు స‌మాచారం. బాలీవుడ్ `అర్జున్ రెడ్డి` పూర్త‌య్యాక తెలుగు సినిమాపై దృష్టి పెడ‌తాడు సందీప్‌. మ‌రి మ‌హేష్ కోసం రాసుకున్న క‌థ ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close