హీరోయిన్‌ కోసం వేట మొదలు పెట్టిన మహేష్‌!

మురుగదాస్‌ అంటే మనకు గుర్తొచ్చేవి డిఫరెంట్‌ మూవీస్‌. కొత్త కాన్సెప్ట్‌లతో మురుగదాస్‌ చేసే సినిమాలంటే అందరూ ఇష్టపడతారు. మహేష్‌కి మురుగదాస్‌తో సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో వుందట. అలాగే మురుగదాస్‌ కూడా మహేష్‌ని డైరెక్ట్‌ చెయ్యాలని వుందని ఒక సందర్భంలో చెప్పాడు. మరి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా వుంటుంది? అనే ప్రశ్నకు ఇద్దరూ త్వరలోనే సమాధానం చెప్పబోతున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని ఇప్పటికే మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మహేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో పివిపి నిర్మిస్తున్న ‘బ్రహ్మూెత్సవం’ చిత్రం తర్వాత మురుగదాస్‌ సినిమా స్టార్ట్‌ అవుతుందట. మురుగదాస్‌తో సినిమాని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్న మహేష్‌ అందులో నటించే హీరోయిన్‌లో కూడా స్పెషాలిటీ వుండాలని భావిస్తున్నాడట. రెగ్యులర్‌ హీరోయిన్‌ కాకుండా కొత్త హీరోయిన్‌ అయితే బాగుంటుందని మురుగదాస్‌కి సజెస్ట్‌ చేశాడట మహేష్‌. ఏప్రిల్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ అవుతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ కోసం వేట ప్రారంభమైంది. ఈనెలాఖరులోగా హీరోయిన్‌ ఫైనల్‌ అయ్యే అవకాశాలు వున్నాయట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close