‘స్పైడ‌ర్’ కొత్త రిలీజ్ డేట్‌.. ఈసారి ప‌క్కా…

మ‌హేష్ – మురుగ‌దాస్‌ల చిత్రం ‘స్పైడ‌ర్‌’ రిలీజ్ డేట్‌లో ఎట్ట‌కేల‌కు ఓ క్లారిటీ వ‌చ్చింది. సెప్టెంబ‌రు 22న విడుద‌ల చేయాలా? 29న రావాలా? అంటూ చిత్ర‌బృందం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డింది ఇప్ప‌టి వ‌ర‌కూ. ఇప్పుడు మ‌ధ్యే మార్గాన్ని ఎంచుకొంది. సెప్టెంబ‌రు 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం తాజాగా నిర్ణ‌యం తీసుకొంది. సెప్టెంబ‌రు 27.. బుధ‌వారం వ‌చ్చింది. బుధ‌, గురు, శుక్ర‌, శ‌ని, ఆది ఇలా… 5 రోజుల పాటు పండ‌గ చేసుకోవొచ్చు. 27న వ‌స్తే… ద‌స‌రా సీజ‌న్ మొత్తం క్యాష్ చేసుకోవొచ్చ‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్టే. జులైలో ఆ రెండు పాట‌ల్నీ తెర‌కెక్కిస్తారు. ఆగ‌స్టులో పాట‌ల్ని విడుద‌ల చేస్తారు. సెప్టెంబ‌రు రెండోవారంలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేసి, 27న విడుద‌ల చేస్తారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమాని విడుద‌ల చేయాలి. అందుకే… రెండు చోట్లా అనువైన డేట్‌ని ఎంచుకోవ‌డానికి ఇంత టైమ్ ప‌ట్టింద‌ని తెలుస్తోంది. 27న రావ‌డం ఖాయ‌మ‌ని, ఆ డేట్ మిస్స‌వ్వ‌ద‌ని నిర్మాత‌లు క్లారిటీగా చెప్పేశారు. సో.. మ‌హేష్ ఫ్యాన్స్ కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com