పూరితో సినిమా… కండీష‌న్స్ అప్లై

బ్ర‌హ్మోత్స‌వం రిజ‌ల్ట్ త‌ర‌వాత మ‌హేష్ బాబు ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. త‌న సినిమా హిట్ట‌యితే శ్రీ‌మంతుడులా కోట్లు ఆర్జిస్తుంది. ఫ్లాప్ అయితే మాత్రం ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో.. బ్ర‌హ్మోత్స‌వం తేల్చి చెప్పింది. అందుకే మ‌హేష్ మ‌రింత జాగ్ర‌త్త‌ప‌డిపోతున్నాడ‌ని టాక్‌. ఇటీవ‌లే పూరి జ‌గ‌న్నాథ్ తో మ‌హేష్ త‌న హ్యాట్రిక్ సినిమా ఎనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి జ‌న‌గ‌ణ‌మ‌న అనే టైటిల్ కూడా క‌న్‌ఫామ్ చేసేశారు. పూరితో మ‌హేష్ సినిమా అంటే దానికుండే క్రేజ్ వేరు! అంత‌కు ముందు సినిమాలు ఫ్లాప్ అయినా… ఆ ప్ర‌భావం ఈ కాంబినేష‌న్‌పై అంతంత మాత్రంగానే ప‌డుతోంది. అయినా సరే.. మ‌హేష్ మాత్రం పూరికి కండీషన్ల‌పై కండీష‌న్లు పెడుతున్నాడ‌ట‌. బ్ర‌హ్మోత్స‌వం సినిమాకి ముందు.. పూరి – మ‌హేష్ ల‌మ‌ధ్య భేటీ జ‌రిగింది. టైటిల్ గురించీ, సినిమా లైన్ గురించి చూచాయిగా మ‌హేష్ కి వినిపించాడు పూరి. మ‌హేష్ కూడా ఎగ్జ‌యిట్ అయి ఓకే చెప్పేశాడు. కానీ. ఆ త‌ర‌వాత మాత్రం.. కండీష‌న్ల ప‌ర్వం మొద‌లెట్టాడ‌ట‌.

కండీష‌న్ నెంబ‌ర్ 1 ఏంటంటే.. క‌థ పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. సెకండాప్ త‌ర‌వాత చూద్దాం, ముందు సినిమా మొద‌లెట్టేద్దాం అనుకొంటే వ‌ద్దు… అంటున్నాడ‌ట‌. దానికి తోడు నిర్మాత ఎవ‌రైనా స‌రే, ప‌బ్లిసిటీ కి రూ.5 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టాల‌ట‌. అన్నింటికంటే ముఖ్యంగా క‌ల్యాణ్ రామ్ సినిమా హిట్ట‌వ్వాల‌ట‌. ఈ మూడు కండీష‌న్ల‌కూ పూరి ఓకే అనేశాడ‌నిటాక్‌. అందుకే ఇప్పుడు క‌ల్యాణ్ రామ్ సినిమాపై పూరి త‌న దృష్టినంతా కేంద్రీక‌రించాడ‌ని, ఈ సినిమా ఫ్లాప్ అయితే మ‌హేష్ సినిమా చేజారిపోతుంద‌న్న భ‌యం పూరిలో ఉంద‌ని టాక్‌. ఓవైపు క‌ల్యాణ్ రామ్ సినిమా ప‌నుల్లో ఉన్న పూరి.. మ‌రోవైపు మ‌హేష్ బాబు క‌థ‌ని పూర్తి స్థాయిలో సిద్దం చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. అందుకోసం న‌లుగురు రైట‌ర్లు రాత్రీ ప‌గ‌లూ శ్ర‌మిస్తున్నార‌ట‌. వాళ్లు రాసిన సీన్ల‌లో ది బెస్ట్ అనుకొన్న‌ది పూరి తిర‌గ‌రాస్తున్నాడ‌ని తెలుస్తోంది. పూరి మ‌హేష్‌తో సినిమా చేయాలంటే.. ఈమాత్రం క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close