ఓవర్సీస్ లో మహేష్ ని కొట్టేవాడే లేడు

సూపర్ స్టార్ మహేష్ కు మంచి మార్కెట్ ఉంది. అయితే మన దగ్గర కన్నా మహేష్ బాబు ఓవర్సీస్ మార్కెట్ చాలా పెద్దది. దాదాపు అక్కడ రికార్డు స్థాయిల్లో వసూలు చేసిన టాప్ టెన్ సినిమాల్లో మహేష్ వి మూడు సినిమాలు ఉండటం విశేషం. అయితే రీసెంట్ సూపర్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు కూడా దాదాపు మన రూపాయల్లో 13 కోట్లను వసూలు చేసిందట. అందుకే ప్రస్తుతం మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా మీద అందరి దృష్టి పడ్డది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్లో వస్తున్న బ్రహ్మోత్సవం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో 4 మిలియన్ మార్క్ టచ్ చేస్తుందని నమ్ముతున్నారు. అందుకే అక్కడ ఈ సినిమాకు భారీ రేటు పలుకుతుందట. దాదాపు శ్రీమంతుడు లాంగ్ రన్ లో వచ్చిన 13 కోట్లకు బ్రహ్మోత్సవం రైట్స్ అమ్మడం షాకింగ్ గా ఉన్నా.. మహేష్ బాబుకు ఆ స్టామినా ఉందని అంటున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు.

ప్రస్తుతం అక్కడ బాహుబలి తర్వాత మహేష్ క్రియేట్ చేసిన రికార్డులే హయ్యెస్ట్ గా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్ లో మహేష్ ని కొట్టేవాడే లేడని చెప్పాలి. మరి ఓవర్సీస్ లో మరోసారి మహేష్ తన పంజా విసురుతాడో చూడాలి. పివిపి బ్యానర్లో ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్స్ గా చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close