కత్తి మహేష్ అడ్డంగా దొరికిపోయాడు

ఎదుటి వాళ్ళకు చెప్పేటందుకే నీతులున్నాయన్నారు. కత్తి మహేష్ తాజాగా చేసిన కామెంట్స్ వింటే అలానే అనిపిస్తుంది. నిత్య విమర్శకుడిగా మారి ఎడతెరపి లేకుండా టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ హక్కులు, విలువలు అంటూ స్పీచులు మీద స్పీచులు ఇస్తున్న మహేష్ కత్తి తాజాగా టంగ్ స్లిప్ అయిపోయాడు. టంగ్ స్లిప్ అనడం కంటే నిజ స్వూరూపం బయటపెట్టాడని చెబితే సరిపోతుంది.

Kathi Mahesh lewd messages to two women (Part 1)

”పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నా పై చేస్తున్న రభసకు పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి’అని డిమాండు చేస్తూ గత నాలుగు నెలలుగా టీవీలకు అంకితమైనపోయిన కత్తి మహేష్ ఈ రోజు మళ్ళీ ఒక చర్చలో కూర్చున్నాడు. కత్తి మహేష్‌ పై ఇటివలే కొన్ని ఆరోపణలు చేశాడు నటుడు, నిర్మాత రాంకీ. మహేష్ కత్తి తన వద్దకు ఓ స్టోరీ తీసుకొచ్చాడని, పాపం అని అవకాశం ఇస్తే తన ప్రవర్తనతో చికాకు తెప్పించాడని, మహేష్ కత్తిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి పాపం చేశానని , “రిపోర్టర్” అనే సినిమాకు తనతో ఏడు రోజులు కూడా పనిచేయలేకపోయాడని, అంతేకాదు మహేష్ స్త్రీ లోలుడని, ఆర్టిస్టుల సెలక్షన్ అతడికే అప్పగించినందుకు, తమకు ఏవేవో మెసేజ్‌లు పెడుతున్నాడు అని చాలా మంది ఫోన్‌లు కూడా చేశారని, ఈ దరిద్రం ఇలా కంటిన్యూ అవకుండా ఆపాలనే ఈ రోజు నేను మాట్లాడాల్సి వస్తోందని కొన్ని ఆరోపణలు చేశాడు రాంకీ.

తాజాగా చర్చకు రాంకీ కుడా వచ్చాడు. చర్చ మధ్యలో యాంకర్ , ”మీరు స్త్రీ లోలుడని చెబుతున్నారు” దానికి మీ సమాధానం అనే ప్రశ్నకు మహేష్ బదులిస్తూ.. తన నిజ స్వరూపం బయటపెట్టాడు. ”అవును అమ్మాయిలకు మెసేజ్ పెట్టాను. మీరు అంటే నాకు ఇష్టం అని చెప్పను. మీరు నాకు కావాలి అని కూడా అడిగాను. అదే కాదు నాకు ఎవరు నచ్చిన ఇదే మాట చెబుతాను. ఇందులో తప్పు ఏంటి ?” అంటూ తిరిగి యాంకర్ నే నిలదీయడం షాక్ కు గురి చేసింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు చెబుతుంటారు. నా ఆనందం తప్పా నాకేం నైతిక విలువలు లేవని ఆయన డిక్లేరు చేసుకున్నాడు. కానీ, నిత్యం నైతిక విలువలు, హక్కులు అని ఊకదంపుడు ఉపన్యాశాలు ఇచ్చే కత్తి మహేష్ ఇలా మాట్లాడటం.. ఆయన నిజ స్వరూపాన్ని భయపెట్టినట్లుయిందని టీవీ చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిత్వం, నైతిక విలువలు అంటూ చెలరేగిపోయే మహేష్.. ఇలా అమ్మాయిలకు మెసేజ్ పెడతాను.. మీరు కావాలని అడుగుతాని” అనడం ఎలాంటి నైతికతను సూచిస్తుందో మహేష్ కత్తే చెప్పాలి. ఏదేమైనా మహేష్ కత్తి మాటలు అనైతికంగా వున్నాయని చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close