కత్తి మహేష్‌కు ప్రమాదం – సోషల్ మీడియా వికృతం..!

బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఫేమ్‌లోకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలతో సెలబ్రిటీగా మారిన కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కారు.. వేగంగా ఎదురుగాఉన్న కంటెయినర్ లారీని ఢీకొట్టింది. పూర్తిగా మహేష్ కూర్చున్న వైపు కారు మొత్తం తునాతునకలయింది. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. అయితే ఆయన తలకు.. ముక్కుకు.. కళ్లకు తీవ్ర గాయాలు అయినట్లుగా వైద్యులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత నెల్లూరులోని ఆస్పత్రికితరలించారు. అక్కడ ముక్కుకు ఆపరేషన్ చేశారు కళ్లకు ఆపరేషన్లు చేయాల్సి ఉంది. కత్తి మహేష్‌కు ప్రమాదం గురించి తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి.

కొంత మంది కత్తి మహష్‌కు జరిగిన ప్రమాదాన్ని కామెడీగా క్రియేట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఓ హీరోకు చెందిన అభిమానులు… రాముడ్నిఆరాధించే మరోపార్టీకి చెందిన వారు.. మహేష్‌ కు జరిగిన ప్రమాదంపై దారుణ వ్యాఖ్యలు పెడుతున్నారు. ఆయనకు అలా జరగడం..ఆయనకు దేవుడు వేసిన శిక్ష అని కొంత మంది తీర్పులిస్తున్నారు. ఇప్పుడు.. కత్తి మహేష్ ప్రాణాలకేం ప్రమాదంలేదు కానీ.. ఆయన బతికి ఉన్నంత కాలం ఇబ్బందిపడతారని.. మరకొందరు మానవత్వం లేకుండాపోస్టులు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం … రాజకీయ.. సాహిత్యపరమైన విమర్శలు ఎప్పుడూ విమర్శలుగానే చూడాలని.. ఆయనకు కీడు జరగాలని కోరుకూడదని అంటున్నారు.

ఆయన మిత్రులు.. ఆయన కోసం ఆరా తీస్తూ… తాము ఉన్నామని భరోసా ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మధ్యాహ్నం వరకూ క్లారిటీ రాలేదు. స్వల్ప గాయాలు అయ్యాయని ఉదయం చెప్పుకున్నారు కానీ.. మధ్యాహ్నానికి ఆయనకు జరిగిన గాయాలు… తీవ్రమైనవేనని చెబుతున్నారు. ముక్కుకు ఆపరేషన్ పూర్తయిందని.. ఇతర ఆపరేషన్లు ఉన్నాయంటున్నారు. ఆయన హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేయకపోవడంతో మరిన్ని రూమర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలోరకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close