మజ్ను… టైం బాడ్

నాని సినిమా అంటే ‘హాయిగా ఓసారి చూడొచ్చు’ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అతనికి యంగ్ ఆడియన్స్ సపోర్ట్ తో పాటు, ఫామిలీ ఆడియన్స్ దీవెనలూ వున్నాయి. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర నాని సినిమాలు వసూళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. నాని సినిమా అంటే భారీ ఓపెనింగ్ రావడం కూడా ఖాయమైపోయింది. వరుస విజయాల నేపధ్యం లో మజ్ను సినిమా కీ అదే స్థాయి లో ఓపెనింగ్ వస్తాయని ఆశపడింది చిత్ర బృందం. అయితే భారీ వర్షాల ఎఫెక్ట్ మజ్ను పై బాగా పడింది. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. గురువారం సాయత్రం మొదలైన వర్షం శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. ఆ ఎఫెక్ట్ మజ్ను సినిమా పై పడింది. సాధారణం గా నాని సినిమా అంటే తొలి రోజున 90 నుంచి 100 శాతం థియేటర్లు ఫుల్ అవుతాయి. కానీ మజ్ను మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యలేదు. ఎక్కడ చూసినా 60 శాతం టికెట్లు కూడా తెగలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి.

మల్టీప్లెక్స్ లలో కూడా అదే పరిస్థితి. వర్షం కారణంగా ఇంట్లోంచి బయటకి రావడానికి జనం జంకుతున్నారు. ఇక సినిమాలేం చూస్తారు.? అందుకే మజ్ను కి వసూళ్లు నీరసంగా వున్నాయి. శనివారం కూడా భారీ వర్షాలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ సూచన ప్రజలకే కాదు.. మంజు బృందానికి తలనొప్పి తెస్తోంది. అందుకే నాని కూడా వార్షాలు తగ్గిపోవాలి.. మా సినిమా కోసం కాదు.. ప్రజల కోసం అంటూ ట్వీట్ చేసాడు. జనతా గ్యారేజ్ పై కూడా ఈ వర్షాలు పెను ప్రభావాన్ని చూపించాయి. వర్షం పడని రోజు నైజం లో ఒక్కరోజుకి రూ. 20 లక్షల దాకా వసూళ్లు వస్తే… వర్షం పడిన రోజు రూ. 1 లక్ష కి పడిపోతున్నాయట. వర్షం ఎఫెక్ట్ ఎంతో చెప్పడానికి ఎంత కంటే ఉదాహరణ ఏం కావాలి. టైం బాడ్ అనుకోవాలంతే .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close