అనుష్క కోసం ఆగ‌లేక‌పోతున్న ప్ర‌భాస్ టీమ్‌

సాహో టీమ్ నుంచి అనుష్క దాదాపుగా బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్టే. ప్ర‌భాస్ బ‌ల‌మైన రిక‌మెండేష‌న్ తో అనూహ్యంగా సాహో టీమ్ లోకి వ‌చ్చిన స్వీటీ… వ్య‌క్తిగ‌త కార‌ణాలు చూపిస్తూ ఇప్పుడు త‌ప్పుకోవ‌డం కాస్త ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సాహోలో క‌థానాయిక‌గా చాలామంది పేర్లు ప‌రిశీలించారు. అయితే.. వాళ్లంతా బాలీవుడ్ వాళ్లే. సాహో కోసం ఎవ‌రిని సంప్ర‌దించినా.. భారీ పారితోషికం డిమాండ్ చేయ‌డంతో సాహో బృందం ఖంగుతింది. ఓ క‌థానాయిక అయితే ఏకంగా రూ.8 కోట్లు అడిగింద‌ట‌. దాంతో.. సౌత్ ఇండియ‌న్ భామ‌కే ఫిక్స‌య్యారు. ప్ర‌భాస్ – అనుష్క కాంబినేష‌న్‌కి క్రేజ్ ఉండ‌డంతో.. స్వీటీని టీమ్ లోకి తీసుకొచ్చారు. సాహో సినిమా మొద‌లై… ఇంత‌కాల‌మైనా అనుష్క త‌న డేట్లు ఇవ్వ‌డంలో ఇంకా మొహ‌మాట‌ప‌డుతోంద‌ట‌.

రెండు నెల‌ల వ‌ర‌కూ కాల్షీట్లు ఇవ్వ‌లేన‌ని, వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోతున్నాన‌ని చెప్ప‌డంతో సాహో టీమ్ సందిగ్థంలో ప‌డింది. దాంతో సాహో కోసం క‌థానాయిక‌ల వేట మ‌ళ్లీ మొద‌లైంది. ఫైన‌ల్‌గా శ్ర‌ద్దా క‌పూర్ పేరు ప‌రిశీలిస్తున్నార‌ని, దాదాపుగా ఈ సినిమాలో శ్ర‌ద్దా ఖాయ‌మైపోయింద‌ని, అయితే అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి ముందు లాంఛ‌నాల‌న్నీ పూర్తి చేసే ప‌నిలో సాహో టీమ్ నిమ‌గ్న‌మైంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ప‌క్క‌న మ‌రోసారి న‌టించే అవ‌కాశం వ‌చ్చినా.. అనుష్క కాదందంటే.. బ‌ల‌మైన కార‌ణం ఏదో ఉండే ఉంటుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయిప్పుడు. మ‌రి ఏమైందో ఏంటో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.