కల్తీమద్యం కేసులో సంచలనం: నేరం అంగీకరించిన విష్ణు సోదరుడు

హైదరాబాద్: విజయవాడలో సంచలనం సృష్టించిన కల్తీమద్యం దుర్ఘటన కేసు ఇవాళ సంచలన మలుపు తిరిగింది. స్వర్ణ బార్‌లోనే మద్యం కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయింది. యజమాని, మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్ నేరం అంగీకరించారని చెబుతున్నారు. శ్రీనివాస్‌ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. క్యాషియర్ వెంకటేశ్వరరావు మద్యంలో మత్తుకోసం స్పిరిట్ కలిపినట్లు శ్రీనివాస్ విచారణలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాషియర్ వెంకటేశ్వరరావును పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇవాళ బయటకొచ్చింది. డిపోలనుంచి బార్‌కు వచ్చిన 9 బ్రాండ్లలో కల్తీ లేదని, బార్‌లోనే కల్తీ జరిగిందని తేల్చారు. మద్యంలో ఒకరకమైన రసాయనం కలిసిందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. కల్తీమద్యం ఘటనలో ఐదుగురు చనిపోయాగా, ఒకరికి బ్రెయిన్ డెడ్ అయింది. మరోవైపు ఈ కేసులో తొమ్మిదవ నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు కటక్ వెళ్ళినట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close