ప్రి వ్యూ….మల్లేశం

చల్ది అన్నాన్ని పక్కన పెట్టి, బ్రేక్ ఫాస్ట్ ను, మ్యాగీ న్యూడుల్స్ ను అలవాటు చేసేసుకున్న జనరేషన్ ఇది. ఇప్పుడు ఎంత ఘనంగా చెప్పినా, ఎంత గొప్పది అని చెప్పినా చల్ది అన్నాన్ని తినమంటే తినే జనాలు ఎక్కడ వుంటారు.
తెలంగాణ సమాజానికి బహు ముఖాలు వున్నాయి. విలాసంగా చూసుకుంటే మటన్, మందు, మజా కనిపిస్తుంది. కానీ అది మాత్రమే తెలంగాణ సంస్కృతి కాదు. సంబురాలు, పెళ్లి పేరంటాల పద్దతులు. మాట, మంచీ, విషాదం, విలాపం ఇలా ఇంకా చాలా వుంది.

ఆ మధ్య వచ్చిన ఫలక్ నుమా దాస్ కుర్రకారుకు నచ్చే ‘బస్తీ’ సంస్కృతికి అద్దం పడితే, ఈవారం రాబోతూన్న మల్లేశం తెలంగాణ పల్లె జీవనాన్ని కళ్లకు కడుతుంది. తెలంగాణ నేత కార్మికుల కోసం ‘ఆసు యంత్రాన్ని’ కనిపెట్టిన మల్లేశం బతుకుగాథనే మల్లేశం సినిమా. ఒక విదంగా ఇదో బయోపిక్.

అయిదున్నర గజాల చీర నేయాలంటే కొన్ని వేలసార్లు చేతిని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పాల్సిన పని నేత కుటుంబాలలోని మహిళలది. ఈ పని కారణంగా భుజం గూడులు జారిపోయి, ప్రతి మహిళ జబ్బుపడడమే. అలాంటి పరిస్థితి చూసి, ఓ యంత్రం కనిపెట్టి, తన అమ్మకే కాదు, మరే అమ్మకూ కష్టం వుండకూడదని తపించిన వాడు చింతకింది మల్లేశం. ఆ యంత్రం తయారుచేయడానికి అతను పడిన తపన, అతను పడిన కష్టాలు. అతను గడిపిన నిద్రలేని రాత్రులు, అతను పడిన మాటలు, అఖరికి అతను సాధించిన విజయం. ఇదే మల్లేశం సినిమా.

మల్లేశం సినిమా అంతర్లీనంగా తెలంగాణ పల్లె బతుకులకు, పలుకుబడికి, నుడికారానికి, మమకారానికి, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది. కేవలం ఓ విజయగాధను తెరకెక్కించడమే ధ్యేయంగా పెట్టుకోలేదు దర్శకుడు రాజ్ ఆర్. ఓ యువకుడి విజయగాధ ను చెబుతూనే, ఆ కథా కాలాన్ని పెనవేసుకున్న తెలంగాణ సంస్కృతిని కూడా ఓపిగ్గా చెక్కాడు. ఆ చెక్కడంలో ఇలా తీస్తే, జనాలు సినిమా కు వస్తారా? రారా? చూస్తారా? చూడరా? అన్నది పట్టించుకున్నట్లు కనిపించలేదు.

సినిమాలో ప్రముఖంగా కనిపించేవి నాలుగే పాత్రలు, మల్లేశం తల్లి (ఝాన్సీ) తండ్రి. అలాగే మల్లేశం (ప్రియదర్శి) అతని భార్య (అనన్య). ఈ పాత్రలు ఏవీ పరిథి దాటి ప్రవర్తించవు. ఆర్టిఫిషీయాలిటీ అన్నది మచ్చుకు కూడా కనిపించదు. అలా అని నాటకీయత కూడా వుండదు. కొన్ని గంటలు తెలంగాణ పల్లెలో నేత కార్మికుల మధ్యలో గడిపి వచ్చిన ఫీల్ మాత్రమే వుంటుంది.

సినిమా టేకింగ్ లో కానీ, స్క్రిప్ట్ లో కానీ, సంభాషణల్లో కానీ, సాంకేతిక విషయాల్లో కానీ ఎక్కడా వంక పెట్టే అవకాశాన్ని మల్లేశం యూనిట్ ఇవ్వలేదు. అయితే ఇక్కడ అసలు సమస్య ఒకటి వుంది.

సినిమాకు తీసుకున్న పాయింట్ చిన్నది. ఆసుయంత్రాన్ని కనిపెట్టడానికి ఓ యువకుడు పడిన తపన. అతను సాధించిన విజయం. ఇదేమంత సినిమాటిక్ గా వుండదు. చాలా సాదీ సీదాగా వుంటుంది. చిన్న పిల్లవాడు మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ, ఎక్కుతూ, దిగుతూ, అక్కడిక్కడే కిందా మీదా అయిన చందంగా కథ అక్కడే సుడితిరుగుతూ వుంటుంది. ప్రేక్షకుడికి తెలుసు. ఈ యంత్రం ఎప్పటికి అయినా తయారు అవుతుంది అని. అందుకే ఈ ప్రయత్నాలు అన్నీ ఏమంత ఆసక్తిని రేకెత్తించవు. ఎప్పటికి విజయం సాధిస్తాడు అన్న దాని మీదే ప్రేక్షకుడి ఆలోచన వుంటుంది. అందువల్ల ఈ మధ్యలో జరిగే సంఘటనలు ఎంత సహజంగా వున్నా, ఎంత హృద్యంగా వున్నా, ఎంత చక్కగా వున్న పెద్దగా రసస్పందనను కలుగచేయవు.

అయితే దర్శకుడు సినిమాను చాలా క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేసాడు. తొలిసగం సినిమా ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టదు. ఆసక్తికరంగా వున్న కొత్త వాతావరణం (ఈ కాలం పట్టణ వాసులకు) అలా అలా చూసేలా చేస్తుంది.
కానీ సినిమా ద్వితీయార్థంలోకి ప్రవేశించాక, కథ హైదరాబాద్ లో ఎంటర్ అయ్యాక, ఆ కొత్త వాతావరణం అన్నది పోతుంది. ఆసక్తి సన్నగిల్లుతుంది. కానీ ఇంతలోనే సినిమా చటుక్కున ముగిసిపోతుంది. సినిమా ముగింపులో నాటకీయత కానీ, సినిమాటిక్ క్లయిమాక్స్ సూత్రాలు కానీ పెద్దగా కనిపించవు. వాస్తవానికి అప్పుడే సినిమా ముగిసిపోతుందని ప్రేక్షకుడు అనుకోడు. కానీ చటుక్కున ముగిసిపోతుంది. చివరి అయిదు నిమషాలు ఒరిజినల్ చింతకింది మల్లేశం ను చూపించి, చిన్న డాక్యుమెంటరీ లుక్ తీసుకువచ్చేసారు. అది కూడా కాస్త అనాసక్తికరంగానే వుంటుంది.

ప్రియదర్శిని ఇప్పటి వరకు కమెడియన్ గానే చూసారు. కానీ ఈ సినిమాలో ఓ సీరియస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను చూడొచ్చు. ఝాన్సీకి మంచి పాత్రలు పడితే ఎలా చేస్తుందో ఈ సినిమా పరిచయం చేస్తుంది. అనన్య పాత్రలో అలా ఒదిగిపోయింది.
నాకు నీవని, మరి నీకు నేనని పాట కొన్నాళ్లు వినిపిస్తుంది. కథ విలేజ్ లో వున్నంత సేపూ కెమేరా పనితనం ముచ్చటేస్తుంది.

ఆట, పాటల కమర్షియల్ సినిమా కాదు. మూడు జోకులు, ఆరు ఫైట్లు, భారీ సెట్టింగ్ ల సినిమా అసలే కాదు. కానీ మల్లేశం సినిమా ఓసారి చూడాలి.

ఎందుకు? నిన్నటి తెలంగాణ పల్లె వాతావరణాన్ని, ముఖ్యంగా నేత కార్మికుల జీవన శైలిని, అట్టడుగు తెలంగాణలో జన జీవన సాంప్రదాయాలను, నుడికారాన్ని, మమకారాన్ని పరిచయం చేసుకోవడం కోసం. తెలంగాణ సంస్కృతి అంటే మందు, మటన్, తిట్లదండకాలు మాత్రమే కాదు అని తెలుసుకోవడం కోసం.

కానీ ముందే చెప్పుకున్నట్లు మ్యాగీ న్యూడిల్స్ అలవాటు చేసాక, అలవాటు అయ్యాక, చల్లి అన్నం తినమంటే తింటారా? ఏమో?

ఫినిషింగ్ టచ్……ఆసు(యంత్ర)కవిత్వం

తెలుగు360 రేటింగ్‌: N/A

-శ్రీవత్స

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close