బెంగాల్లో శాసనమండలి..! మమతకు అంత ఈజీ కాదు..!

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ..భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రూపొందించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు. ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు పెట్టే ఉద్దేశం బీజేపీ లేదని.. ఓ అభిప్రాయానికి వచ్చిన మమతా బెనర్జీ ప్రతి వ్యూహం అమలు చేయడం ప్రారంభించారు. బెంగాల్‌లో శాసనమండలి ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీలో తృణమూల్‌కు మూడింట రెండు వంతుల మెజార్టీ ఉండటంతో ఆ మేరకు తీర్మానం చేశారు. ఉపఎన్నికలు నిర్వహించకపోతే.. శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే శాసనమండలిని ఏర్పాటు చేయడం కూడా కేంద్రం అనుమతితోనే జరగాల్సి ఉంది. శాసనసభ తీర్మానాన్ని మమతా బెనర్జీ సర్కార్ కేంద్రానికి పంపుతుంది. శాసనసభ తీర్మానానికి అనుగుణంగా పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంది. శాసనమండలి ఏర్పాటు లేదా రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేస్తే సరిపోదు. రాజ్యాంగం ప్రకారం కచ్చితంగా పార్లమెంట్ చట్టం అవసరం. మమతా బెనర్జీని చట్టసభలకు ఎన్నిక కాకుండా చేయాలనుకుంటే బీజేపీ .. తీర్మానాన్ని తొక్కి పెట్టవచ్చు. దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. రాజకీయంగా విమర్శలు మాత్రం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాజస్థాన్, అస్సాం ప్రభుత్వాలు పంపిన శాసనమండలి ఏర్పాటు తీర్మానాలు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ పంపిన విధానమండలి రద్దు తీర్మానం ఇంకా బిల్లు వరకూ రాలేదు.

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం లేదన్న కారణంగా ఉత్తరాఖండ్ సీఎంగా ఉన్న తీరథ్ సింగ్ తో బీజేపీ హైకమాండ్ రాజీనామా చేయించింది. ఉపఎన్నికలు పెట్టే అవకాశం లేదని.. ఈసీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మమతా బెనర్జీ… నందిగ్రాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఆరు నెలల్లో గెలిస్తే సీఎంగా ఉంటారు. లేకపోతే రాజీనామా చేయక తప్పదు. మమతను టార్గెట్ చేసే.. తీరత్ సింగ్‌ను బీజేపీ హైకమాండ్ బలిచ్చిందని బెంగాల్ రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అదే నిజం అయితే.. మండలి ఏర్పాటునూ బీజేపీ అడ్డుకుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close