బంగ్లాదేశీయులకు స్వాగతం, భారత సైన్యానికి ఎంత ధైర్యం!

బెంగాల్లో భారతీయ ఆర్మీ జవాన్లు తనిఖీలు చేయడంపై సీఎం మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తమ అనుమతి లేకుండా ఆర్మీ ఎలా ప్రవేశించిందని హూంకరించారు. అదేదో వేరే దేశపు సైన్యం అన్నట్టు అక్కసు వెళ్లగక్కారు. ఇండియన్ ఆర్మీ జవాన్లు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తారు, అదేంటని అడిగే హక్కు రాష్ట్రపతికి తప్ప ఎవరికీ లేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఈ విషయం కూడా తెలియదా అని బీజేపీ వారు మండిపడ్డారు.

మమతా బెనర్జీ తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కొందరు సెటైర్లు వేశారు. బెంగాల్లోకి బంగ్లాదేశీ అక్రమ చొరబాటు దారులు ప్రవేశించడం సర్వ సాధారణం. దీనిపైనా కొందరు వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు. మమత అనుమతి లేకుండా బెంగాల్లో అడుగుపెట్టడానికి ఆర్మీకి ఎంత ధైర్యం. బంగ్లా అక్రమ చొరబాటు దారులకు మాత్రమే ఆ అధికారం ఉంటుంది. ఎందుకంటే వాళ్లను ఓటు బ్యాంకుగా మార్చుకోవచ్చు అని కొందరు పోస్ట్ చేశారు.

మమతా బెనర్జీ అబద్ధాల పునాదులపై జాతీయ రాజకీయ సౌధాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ప్రయాణించిన ఇండిగో విమానంలో ఇంధనం తక్కువగా ఉన్నా కోల్ కతా విమానాశ్రయంలో త్వరగా ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదని గురువారం పార్లమెంటులో తృణమూల్ సభ్యులు రభస సృష్టించారు. అయితే అది అబద్ధమని, విమానంలో తక్కువ ఇంధనం ఉందనేది నిజం కాదని ఇండిగో సంస్థ స్పష్టం చేయడంతో మమత పార్టీ అబద్ధాల గుట్టు రట్టయింది.

బెంగాల్లో ఆర్మీ జవాన్ల తనిఖీలపైనా శుక్రవారం పార్లమెంటు లోపలా బయటా దుమారం రేగింది. తన మీద సైనిక కుట్ర జరిగిందని మమత ఆరోపించారు. ఆమె ఏమైనా దేశాధినేతా? ఆమెను దింపడానికి సైన్యాన్ని పంపాలా? ఆర్టికల్ 356 ప్రయోగిస్తే ఆమె ప్రభుత్వం పడిపోదా? తనిఖీల గురించి తమకు తెలియదని మమత చెప్పడం కూడా అబద్ధమని ఆర్మీ తేల్చేసింది. ఈ విషయంలో ఆర్మీకి, బెంగాల్ అధికార యంత్రాంగానికి మధ్య మొత్తం 8 సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఆ లేఖల కాపీలను కూడా కొన్ని న్యూస్ చానళ్లు ప్రదర్శించాయి.

శారదా కుంభకోణం దర్యాప్తు కొలిక్కి వస్తున్న కొద్దీ మమతలో భయం పెరుగుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ఎక్కడ సీబీఐ తనను అరెస్టు చేస్తుందో అని ఆమె ఆందోళన చెందుతున్నారని, తన నీడను చూసినా భయపడే స్థితికి వెళ్లారని కమలనాథులు ఆరోపిస్తున్నారు. సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగే స్థాయికి దిగజారిన దీదీ అంటూ తీవ్ర విమర్శలుచేస్తున్నారు.

ప్రతిదానికీ కేంద్రంపై దుమ్మెత్తి పోస్తే సీబీఐ అరెస్టు చేసినా అది కక్ష సాధింపు అని ఆరోపించ వచ్చనేది మమత ఆలోచనా? అవుననే అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close